ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ సామ్ కరన్‌పై ప్రశంసలు కురిపించారు భారత ఆటోమొబైల్ దిగ్గజం ఆనంద్ మహీంద్రా. కరన్ ఆటతీరును.. హీరోయిజం, వినయం, దయ నిర్వచనంతో పోల్చారు. "మీరు హీరోయిజం, వినయం, దయ నిర్వచనం కోసం చూస్తున్నట్లయితే" అంటూ సామ్ కరన్ పోస్ట్‌ను ఉటంకిస్తూ ట్వీట్ చేశారు.
-
If you’re looking for the definition of heroism, humility & grace... https://t.co/0xgsv72NGF
— anand mahindra (@anandmahindra) March 30, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">If you’re looking for the definition of heroism, humility & grace... https://t.co/0xgsv72NGF
— anand mahindra (@anandmahindra) March 30, 2021If you’re looking for the definition of heroism, humility & grace... https://t.co/0xgsv72NGF
— anand mahindra (@anandmahindra) March 30, 2021
ఇండియాతో చివరి వన్డేలో అద్భుతమైన పోరాట పటిమ చూపాడు సామ్ కరన్. చివరి వరకు క్రీజులో ఉండి ఇంగ్లాండ్‌ను గెలిపించే ప్రయత్నం చేశాడు. 95 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో భారత్ 7 పరుగుల తేడాతో గెలిచి.. సిరీస్ కైవసం చేసుకుంది.
"గొప్ప సిరీస్‌లో భాగంగా చాలా విషయాలు నేర్చుకున్నా. టీమ్ఇండియాకు ధన్యవాదాలు" అని ట్వీట్ చేశాడు కరన్. దీనినే ట్యాగ్ చేస్తూ కామెంట్ పెట్టారు మహీంద్రా.
ఇదీ చదవండి: సామ్ కరన్లో ధోనీ లక్షణాలు: బట్లర్