ETV Bharat / sports

సవాళ్లు విసిరే పిచ్‌పై దుమ్మురేపిన హిట్​మ్యాన్​!

ఇంగ్లాండ్‌తో రెండో టెస్టులో భారీ శతకం బాదిన హిట్‌మ్యాన్‌ రోహిత్‌ శర్మపై ప్రశంసల జల్లు కురుస్తోంది. కఠినతరమైన పిచ్‌పై చేసిన ఈ సెంచరీకి ఎంతో విలువుందని మాజీ క్రికెటర్లు అంటున్నారు. జట్టుకు తానెంతో కీలకమైన ఆటగాడినని హిట్‌మ్యాన్‌ నిరూపించుకున్నాడని పేర్కొన్నారు.

Rohit Sharma
సవాళ్లు విసిరే పిచ్‌పై దమ్మురేపిన హిట్​మ్యాన్​!
author img

By

Published : Feb 13, 2021, 5:51 PM IST

చెపాక్‌ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో భారీ సెంచరీ(161)తో ఆకట్టుకున్నాడు రోహిత్​ శర్మ. ఈ క్రమంలో సుదీర్ఘ ఫార్మాట్​లో ఏడో శతకం సాధించిన హిట్​మ్యాన్​పై ప్రశంసలు కురిపించారు మాజీలు. గింగిరాలు తిరుగుతున్న బంతిని సాధికారికంగా ఎదుర్కొని చేసిన ఈ శతకంతో జట్టులో తన విలువేంటో నిరూపించుకున్నాడని పలువురు అభినందించారు. జట్టు స్కోరు 300 పరుగులు చేస్తే అందులో రోహిత్​వే 161 పరుగులు ఉండటం గమనార్హం.

ఈ ఓపెనర్​.. సుదీర్ఘ ఫార్మాట్లో చేసిన ఏడు శతకాలు సొంతగడ్డపైనే సాధించడం విశేషం. దీంతో అతడు అజహరుద్దీన్‌ 6 శతకాల రికార్డును బద్దలు కొట్టాడు. ఇంగ్లాండ్‌, దక్షిణాఫ్రికా, శ్రీలంక, వెస్టిండీస్‌పై అన్ని ఫార్మాట్లలో శతకాలు బాదిన ఏకైక వీరుడిగా అవతరించాడు. హిట్‌మ్యాన్‌ శతకం చేసిన వెంటనే చెపాక్‌ మార్మోగింది. అభిమానులు అరుపులు, కేకలతో సందడి చేశారు. డ్రెస్సింగ్‌ రూమ్‌లో విరాట్‌ కోహ్లీ సహా సహచరులు నిలబడి ఉత్సాహపరిచారు. రోహిత్​ సతీమణి రితికా సజ్దె కూడా చప్పట్లు కొడుతూ ఆనందం వ్యక్తం చేసింది.

హిట్​మ్యాన్​పై మాజీలు స్పందించారిలా..

"రోహిత్‌ చాలా బాగా ఆడావు. సవాళ్లు విసిరే పరిస్థితుల్లో సంతృప్తికర శతకమిది. కఠిన పిచ్‌పై బ్యాటింగ్‌లో నిర్ణయాత్మక ఫుట్‌వర్క్‌, సానుకూల తీవ్రత ప్రాముఖ్యం ప్రదర్శించావు. ఇక శతకాన్ని భారీ స్కోరుగా మలచాలి."

- వీవీఎస్‌ లక్ష్మణ్‌

"రోహిత్‌ శర్మ టాప్‌ క్లాస్‌. సొగసైన, అద్భుతమైన శతకమిది."

- హర్భజన్‌సింగ్‌

"సోదరుడు రోహిత్‌ నుంచి మరో అద్భుతమైన ఇన్నింగ్స్‌. మైదానంలో ఎప్పుడూ తన ముద్ర వేస్తాడు. ఆల్‌ది బెస్ట్‌. త్వరలోనే కలుద్దాం."

- సురేశ్‌ రైనా

"రోహిత్‌ నుంచి జాలువారిన శతకం సెహ్వాగ్‌ తరహా బ్యాటింగ్‌ ద్వారా వచ్చింది! పరిస్థితులు, సవాళ్లు ఎలాఉన్నా తనదైన రీతిలోనే బ్యాటింగ్‌ చేశాడు."

- సంజయ్‌ మంజ్రేకర్‌

"భారత్‌ 147 చేస్తే అందులో 100 రోహిత్‌వి. అతడు మరో స్థాయిలో ఆడుతున్నాడు. ఈ రోజు ఇన్నింగ్స్‌ చూపించిందీ అదే. ఈ టెస్టులో బహుశా ఇదొక్క శతకమే ఉండొచ్చు!"

- ఆకాశ్‌ చోప్రా

"అద్భుతమైన శతకం రోహిత్‌!! గొప్ప గొప్ప ఆటగాళ్లలాగే అతడి బ్యాటింగ్‌ ఎప్పుడూ కన్నుల పండువగానే ఉంటుంది. ఈ శతకం చాలా సింపుల్‌గా అనిపించేలా ఆడాడు కానీ అంత సులువేం కాదు!!!"

- మైకేల్‌ వాన్‌

ఇదీ చదవండి: చెన్నై టెస్టు: రోహిత్​ శతకం- అరుదైన రికార్డు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.