ETV Bharat / sports

ఆ విషయంలో పంత్​దే తప్పు: ఆకాశ్​ చోప్రా

సొంత తప్పుల వల్లే పంత్, జట్టులో చోటు కోల్పోతున్నాడని ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు. ఈ విషయంలో ఆత్మవిమర్శ చేసుకోవాలని అతడికి సూచించాడు.

Aakash Chopra on Rishabh Pant being axed from India ODI, T20I squads
ఆ విషయంలో పంత్​దే తప్పు: ఆకాశ్​ చోప్రా
author img

By

Published : Dec 7, 2020, 6:38 PM IST

టీమ్​ఇండియా యువ క్రికెటర్​ రిషబ్​ పంత్..​ తనకు వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకోవడంలో విఫలమయ్యాడని మాజీ ఆటగాడు ఆకాశ్​ చోప్రా విమర్శించాడు. తుదిజట్టులో స్థానం కోల్పోవడానికి ప్రధాన కారణం అతడి ఆటతీరేనని అభిప్రాయపడ్డాడు. ఆస్ట్రేలియాతో సిరీస్​లో అవకాశం దక్కకపోవడంపై​.. ఆత్మవిమర్శ చేసుకోవాలని పంత్​కు సూచించాడు.

"5,6,7 స్థానాల్లో హార్దిక్​ పాండ్య, రిషబ్​ పంత్​, రవీంద్ర జడేజా బ్యాటింగ్​ చేస్తే ఎలా ఉంటుందో ఆలోచించండి. వావ్​.. అద్భుతమైన టీమ్​ కదా? కానీ, పంత్​.. ఇక చాలని సరిపెట్టుకున్నట్లు కనిపిస్తుంది. తనకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోతున్నాడు. ఈ విషయంలో అతడు ఆత్మవిమర్శ చేసుకోవాలి. అవకాశాలను అందిపుచ్చుకోని కారణంగా తనపై తాను కఠినంగా వ్యవహరించుకోవాలి"

- ఆకాశ్​ చోప్రా, టీమ్​ఇండియా మాజీ క్రికెటర్​

తన వైఫల్యం వల్ల పంత్​ అన్ని ఫార్మాట్లలో అవకాశాన్ని చేజార్చుకున్నాడని ఆకాశ్​ చోప్రా అన్నాడు. "ఆస్ట్రేలియా-ఏ జట్టుతో జరుగుతున్న ప్రాక్టీసు మ్యాచ్​లో వృద్దిమాన్​ సాహాకు వికెట్​ కీపర్​గా ఉన్నాడు. దీంతో టెస్టు సిరీస్​లో పంత్​ తన స్థానం కోల్పోయినట్లు తెలుస్తోంది. అన్ని ఫార్మాట్లకు తానే వికెట్​ కీపర్​గా ఉన్నప్పటి నుంచి ఛాన్స్​ కోసం ఎదురుచూసే పరిస్థితికి అతడు వచ్చాడు" అని ఆకాశ్​ అభిప్రాయపడ్డాడు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.