ETV Bharat / sports

భారత్​తో​ టీ20 సిరీస్​ కోసం ఆస్ట్రేలియా ప్రణాళిక! - కొవిడ్​-19

టీ20 ప్రపంచకప్​ వాయిదాపడిన నేపథ్యంలో భారత్​ టీ20 సిరీస్​ ఆడాలనే ఆలోచనలో ఉంది ఆస్ట్రేలియా. ఈమేరకు చర్చలు జరుపుతోంది.

14-day quarantine puts India-Australia T20I series under scanner
ఆస్ట్రేలియా పర్యటనలో టీ20 మ్యాచ్​లకు రంగం సిద్ధం!
author img

By

Published : Jul 24, 2020, 10:34 AM IST

ఈ ఏడాది చివర్లో భారత్​, ఆస్ట్రేలియా మధ్య నాలుగు టెస్టుల సిరీస్​ జరగనుంది. టీ20 ప్రపంచకప్​ వాయిదా పడిన నేపథ్యంలో టీమ్​ఇండియాతో మూడు మ్యాచ్​ల టీ20 సిరీస్​ నిర్వహించేందుకు క్రికెట్​ ఆస్ట్రేలియా సన్నాహాలు చేస్తోంది. అయితే నిబంధనలను దృష్టిలో ఉంచుకుని పర్యటనకు వచ్చే కోహ్లీసేనను, 14 రోజుల పాటు నిర్బంధంలో ఉంచేందుకు అంతా సిద్ధమని ఆసీస్ బోర్డు సీఈఓ నిక్​ హాక్లీ స్పష్టం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో కంగారూ దేశంలో రెండు వారాల క్వారంటైన్ తప్పనిసరి అని ఓ బీసీసీఐ అధికారి తెలిపారు.

"ఆస్ట్రేలియాలోని కరోనా నియంత్రణ నిబంధనల ప్రకారం నిర్బంధం తప్పనిసరి. మరో మార్గం లేదు. ప్రస్తుతం అందరం ఇదే సమస్యను ఎదుర్కొంటున్నాం. ఈ పరిస్థితులకు అనుగుణంగా ఇతర క్రికెట్​ బోర్డులతో చర్చించి సిరీస్​ షెడ్యూల్స్​ను సర్దుబాటు చేయవలసి ఉంటుంది. దీని వల్ల మ్యాచ్​లను సవరించాల్సి ఉంటుంది. 14 రోజుల నిర్బంధం అంటే సిరీస్​ ప్రణాళికే మారిపోతుంది. టీ20 సిరీస్​ను సిద్ధం చేయాలని సీఏ భావిస్తోంది. ఆసీస్​ పర్యటన ముగించుకున్న తర్వాత టీమ్​ఇండియా.. ఇంగ్లాండ్​తో ఆడనుంది. ఇంగ్లిష్​ జట్టుతో ఓ పింక్ బాల్​ టెస్టు ఆడాలి. కరోనా మహమ్మారిని దృష్టిలో ఉంచుకుని మ్యాచ్​ వేదికలను, ఆటగాళ్లు ఉండటానికి హోటళ్లను సిద్ధం చేయాలి. దీంతో పాటు ప్రభుత్వ నిబంధనలను పాటించడం తప్పనిసరి"

-బీసీసీఐ అధికారి

ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్​ పర్యటనల మధ్య ఉన్న సమయంలో భారత్-ఆసీస్ టీ20 సిరీస్ జరపాలనే ఆలోచన చేస్తున్నారని బీసీసీఐ అధికారి తెలిపారు. "ఆస్ట్రేలియాలో వన్డే సిరీస్​ వచ్చే ఏడాది జనవరి 17న ముగుస్తుంది. ఇరుజట్లకు కొన్నిరోజులు విరామం దొరుకుతుంది. ఈ సమయంలో టీ20​లను నిర్వహించాలని చూస్తున్నారు. ఒకరోజు విరామంతో మూడు మ్యాచ్​లు జరిపితే జనవరి 24కు మ్యాచ్​లు ముగుస్తాయి. అంటే జనవరి 26 కల్లా టీమ్​ఇండియా స్వదేశానికి చేరుతుంది. అప్పటికి భారతదేశంలో నిర్బంధ నియమాలు ఉండకపోవచ్చు. కాబట్టి ఇంగ్లాండ్​తో సిరీస్​ ఫిబ్రవరిలో ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది" అని చెప్పారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.