శ్రీలంక పర్యటనలో ఉన్న భారత జట్టులోని స్పిన్నర్లు యుజ్వేంద్ర చాహల్, కృష్ణప్ప గౌతమ్లకూ కరోనా సోకింది. కృనాల్ పాండ్యాకు కొవిడ్ పాజిటివ్‌గా తేలిన 3 రోజులకు ఈ విషయం బయటకొచ్చింది.
''దురదృష్టవశాత్తు చాహల్, గౌతమ్‌లకు కరోనా సోకింది. వారు కృనాల్‌తో సన్నిహితంగా ఉన్నారు. ప్రస్తుతం లంకలో హోటల్లో ఉన్న మిగతా జట్టు సభ్యులకు వీరు దూరంగానే ఉన్నారు.''
- అధికారిక వర్గాలు.
ఈ నెల 27న శ్రీలంకతో జరగాల్సిన రెండో టీ20కి ముందు.. టీమ్ ఇండియాలోని కృనాల్ పాండ్యాకు కరోనా సోకినట్లు నిర్ధరణ అయింది. అతనితో సన్నిహితంగా ఉన్న పృథ్వీ షా, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్య, యుజ్వేంద్ర చాహల్, దీపక్ చాహర్, మనీశ్ పాండే, ఇషాన్ కిషన్, కృష్ణప్ప గౌతమ్లనూ ఐసోలేషన్‌లో ఉంచారు. వీరంతా సిరీస్‌కు దూరమయ్యారు.
స్వ్కాడ్‌లో ఎక్కువమంది ఉన్న కారణంగా.. ఒక బ్యాట్స్‌మెన్‌ను తగ్గించుకుని అందరికీ మిగతా టీ-20 మ్యాచ్‌లకు అవకాశం వచ్చింది. నెట్‌బౌలర్లను కూడా టీంలో చేర్చారు. అయితే.. అనుభవలేమి, ఒత్తిడి కారణంగా అంతలా ఆకట్టుకోలేకపోయారు. చివరి రెండు టీ-20ల్లో ఓడి.. సిరీస్ కోల్పోయింది టీమ్ ఇండియా.
అంతకుముందు వన్డే సిరీస్‌ను 2-1 తేడాతో నెగ్గింది మెన్ ఇన్ బ్లూ.
ఇవీ చదవండి: IND VS SL: మూడో టీ20లో లంక విజయం.. సిరీస్ కైవసం