ETV Bharat / sports

కరోనా కొత్త వేరియంట్.. సందిగ్ధంలో భారత్-దక్షిణాఫ్రికా సిరీస్! - కరోనా కొత్త వేరియంట్ బీసీసీఐ

South Africa Covid Variant: దక్షిణాఫ్రికాలో కరోనా కొత్త వేరియంట్ ప్రపంచ దేశాలను కలవరపెడుతోంది. ఈ నేపథ్యంలో వచ్చే నెల 17న నుంచి ప్రారంభం కావాల్సిన భారత్-దక్షిణాఫ్రికా సిరీస్ సందిగ్ధంలో పడింది. ఈ విషయంపై ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నట్లు ఓ బీసీసీఐ అధికారి వెల్లడించారు.

IND vs SA tour BCCI, IND vs SA tour COVID variant rise, భారత్-దక్షిణాఫ్రికా పర్యటన సందిగ్ధం, భారత్-దక్షిణాఫ్రికా పర్యటన కరోనా కొత్త వేరియంట్
India
author img

By

Published : Nov 26, 2021, 6:58 PM IST

Updated : Nov 26, 2021, 9:07 PM IST

South Africa Covid Variant: దక్షిణాఫ్రికాలో కరోనా కొత్త వేరియంట్​(బీ.1.1.529)తో ప్రపంచదేశాలు వణికిపోతున్నాయి. తమ దేశంలోనూ ఆ వేరియంట్ ప్రభావం కనిపిస్తుందంటూ పలు దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో సౌతాఫ్రికాతో పాటు హాంకాంగ్, బోత్స్​వానా నుంచి వచ్చే ప్రయాణికులపై ఆంక్షలు(South Africa Travel Ban) విధించేందుకు సిద్ధమవుతున్నాయి. ఇదిలా ఉంటే ఈ కరోనా కొత్త రకంతో భారత్-దక్షిణాఫ్రికా మధ్య జరగబోయే సిరీస్ సందిగ్ధంలో పడింది.

India SA Tour 2021: డిసెంబర్​లో దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లనుంది భారత్. దాదాపు ఏడు వారాల సుదీర్ఘ పర్యటనలో మూడు టెస్టులు, మూడు వన్డేలు, నాలుగు టీ20లు ఆడాల్సి ఉంది. ఇందుకోసం వచ్చే నెల 8న సీనియర్ జట్టు సౌతాఫ్రికాకు పయనమవ్వాలి. ఇప్పటికే ఆ దేశంలో అనధికారిక టెస్టు సిరీస్​లో తలపడుతున్న భారత్-ఏ జట్టులో కొందరిని అక్కడే ఉంచేలా ప్లాన్ చేసింది బీసీసీఐ. అసలు సిరీస్ 17న ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో కొత్త రకం కరోనా ఇరుదేశాల క్రికెట్ బోర్డుల్ని కలవరపెడుతోంది. దీనిపై స్పందించిన ఓ బీసీసీఐ అధికారి.. ఈ విషయమై ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నట్లు తెలిపారు.

"దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు వారి దేశంలోని పూర్తి పరిస్థితిపై స్పష్టత ఇచ్చేవరకు మేము ఏమీ మాట్లాడలేం. ప్రస్తుత ప్రణాళిక ప్రకారం కివీస్​తో సిరీస్ ముగిశాక టీమ్ఇండియా వచ్చే నెల 8 లేదా 9న సౌతాఫ్రికాకు బయలుదేరి వెళుతుంది. కరోనా కొత్త వేరియంట్ కారణంగా పలు దేశాలు దక్షిణాఫ్రికా నుంచి వచ్చే ప్రయాణికులపై ఆంక్షలు విధించాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయం గురించి మేము ఎదురుచూస్తున్నాం" అని ఓ అధికారి వెల్లడించారు.

అందరిదీ ఆదే దారి..

కొత్త వేరియంట్ కారణంగా దక్షిణాఫ్రికా నుంచి వచ్చే విమాన సర్వీసుల్ని రద్దు చేసింది యూకే. దీంతో బ్రిటన్​, ఐరిష్​ గోల్ఫ్, రగ్బీ జట్లు హుటాహుటిన వారి దేశాలకు పయనమయ్యాయి. వీరే కాకుండా డీపీ వరల్డ్ టూర్​లో పాల్గొనేందుకు వచ్చిన పలు దేశాలు ఇదే బాటపట్టనున్నాయి. అలాగే యూనైటెడ్ రగ్బీ ఛాంపియన్ షిప్​ను రెండు వారాలు వాయిదా వేశారు నిర్వాహకులు.

ప్రస్తుతం దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న నెదర్లాండ్ క్రికెట్ జట్టు కూడా తమ పర్యటనను అర్ధాంతరంగా వాయిదా వేసుకునేందుక సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ రెండు జట్ల మధ్య నేడు (శుక్రవారం) తొలి వన్డే జరుగుతోంది.

ఇవీ చూడండి: శ్రేయస్ సెంచరీ.. రోహిత్ డ్యాన్స్ వీడియో వైరల్

Last Updated : Nov 26, 2021, 9:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.