ETV Bharat / sports

కోహ్లీ ఫామ్​పై గంగూలీ కీలక వ్యాఖ్యలు.. ఆ పని చేస్తే చాలంటూ.. - సౌరభ్​ గంగూలీ న్యూస్

Sourav ganguly on virat kohli: భారత మాజీ కెప్టెన్​ విరాట్​ కోహ్లీ ఫామ్​పై తీవ్ర విమర్శల నేపథ్యంలో అతడికి అండగా నిలిచాడు బీసీసీఐ ప్రెసిడెంట్​ సౌరభ్​ గంగూలీ. ప్రతి ఆటగాడికి ఇలాంటి క్లిష్ట పరిస్థితులు ఎదురవుతాయని అన్నాడు.

Sourav ganguly on virat kohli
Sourav ganguly on virat kohli
author img

By

Published : Jul 14, 2022, 9:28 AM IST

Sourav ganguly on virat kohli: టీమ్‌ఇండియా మాజీ సారథి విరాట్‌ కోహ్లీ ఫామ్‌పై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న తరుణంలో అతడికి అండగా నిలిచాడు బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరభ్ గంగూలీ. ప్రతి క్రీడాకారుడికి కెరీర్​లో ఇలాంటి క్లిష్ట పరిస్థితులు తలెత్తుతాయని.. ఇలాంటివి సాధారణమైన విషయాలన్నాడు. తనతో పాటు, సచిన్ తెందూల్కర్, రాహుల్ ద్రవిడ్​కు సైతం ఇలాంటి పరిస్థితులు ఎదురయ్యాయని చెప్పాడు. కోహ్లీ మునుపటి ఫామ్​ను అందుకుంటే చాలని అన్నాడు.

"ఓసారి అంతర్జాతీయ క్రికెట్​లో అతడు సాధించిన రికార్డులు చూడండి. నైపుణ్యం, సామర్థ్యం లేకుండా ఇది సాధ్యంకాదు కదా. ప్రస్తుతం అతడు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాడు. ఆ విషయం అతడికి కూడా తెలుసు. కోహ్లీకి తన సామర్థ్యం గురించి అవగాహన ఉంది. త్వరలోనే మునుపటి ఫామ్​ను అందుకుంటే చాలు విజయవంతం అవుతాడు. గత 12-13 ఏళ్లుగా అద్భుతంగా ఆడుతున్నాడు. ఇది ఒక్క కోహ్లీకే సాధ్యం. క్రీడారంగంలో ఇలాంటివి సాధారణం. ప్రతి ఒక్కరికి ఇలా జరుగుతుంది. సచిన్, రాహుల్​, నాకు జరిగాయి. కోహ్లీకీ కుడా అదే జరిగింది. భవిష్యత్తులో వచ్చే ఆటగాళ్లకు కూడా జరుగుతుంది. ఇదంతా క్రీడల్లో భాగం. ఒక క్రీడాకారుడిగా వారు చెప్పేది జాగ్రత్తగా విని.. మన ఆట మనం ఆడుకోవాలి."
-సౌరభ్​ గంగూలీ, బీసీసీఐ ప్రెసిడెంట్​

ఇప్పటికే విరాట్ కోహ్లీ తన పేలవ ప్రదర్శనతో అనేక విమర్శలను ఎదుర్కొంటున్నాడు. టీ20ల్లో నుంచి విరాట్​ను పక్కనపెట్టాలని సూచించాడు దిగ్గజ ఆటగాడు కపిల్​దేవ్. సరిగ్గా ఆడని ఆటగాళ్లను పక్కనపెట్టాలని మాజీ పేసర్​ వెంకటేశ్​ ప్రసాద్ అభిప్రాయపడ్డాడు. మరోవైపు కోహ్లీ జట్టుకు భారంగా మారాడని పాకిస్థాన్‌ మాజీ స్పిన్నర్‌ డానిష్‌ కనేరియా తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. విరాట్ కోహ్లీ ప్రదర్శన ఇలానే కొనసాగితే ఆక్టోబర్​ 16 నుంచి ప్రారంభంకానున్న ఐసీసీ టీ20 ప్రపంచకప్​ జట్టులో స్థానం కష్టంగా మారే అవకాశం ఉంది.

గంగూలీని సత్కరించిన బ్రిటన్ పార్లమెంట్​:
మరోవైపు, బీసీసీఐ ప్రెసిడెంట్​ సౌరభ్ గంగూలీని ఘనంగా సత్కరించింది బ్రిటన్ పార్లమెంట్​. ఒక బంగాలీగా బ్రిటన్​ పార్లమెంట్​లో తనను సత్కరించడం ఆనందంగా ఉందని గంగూలీ అన్నాడు. 20 ఏళ్ల కింద 2002లో నాట్​వెస్ట్ ఫైనల్లో గెలిచిన అనంతరం సత్కారాన్ని అందుకున్న గంగూలీ.. తిరిగి ప్రస్తుతం అదే రోజున ఆ గౌరవాన్ని స్వీకరించాడు.

ఇవీ చదవండి:

'అలా ఆడితే ఎల్బీడబ్ల్యూ ఇవ్వాలి.. వన్డే క్రికెట్ ప్రాధాన్యత చాటుకోవాలి'

ICC Rankings: వన్డేల్లో బుమ్రా మళ్లీ నంబర్​ వన్​.. టీ20లో 5వ స్థానానికి సూర్య

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.