ETV Bharat / sports

'టీ20 ప్రపంచకప్​కు ముందు విశ్రాంతి అవసరం' - rizwan in t20 wc

టీ20 ప్రపంచకప్​నకు ముందు ఆటగాళ్లకు విశ్రాంతి కావాలని పాకిస్థాన్​ క్రికెటర్​ మహ్మద్ రిజ్వాన్ (Muhammed Rizwan) అభిప్రాయపడ్డాడు. చాలా రోజులుగా బయో బబుల్​లో గడపడం వల్ల క్రికెటర్లు మానసిక ఒత్తిడికి గురవుతున్నారని తెలిపాడు.

muhammed rizwan
ముహమ్మద్ రిజ్వాన్
author img

By

Published : Aug 20, 2021, 1:33 PM IST

బయోబబుల్​లో నిర్విరామంగా గడపడం వల్ల ఆటగాళ్లు మానసిక ఒత్తిడికి గురవుతున్నారని పాకిస్థాన్​ టెస్టు జట్టు వైస్​ కెప్టెన్​ మహ్మద్​ రిజ్వాన్​ (Muhammed Rizwan) అభిప్రాయపడ్డాడు. అందుకే టీ20 ప్రపంచకప్​నకు ముందు క్రికెటర్లకు కాస్త విశ్రాంతినివ్వాలని సూచించాడు.

"బయోబబుల్​లో ఎక్కువ రోజులు గడపడం చాలా కష్టం. గతేడాది కాలంగా మేము చాలా క్రికెట్​ ఆడాం. ఇది మాకు మంచిదే అయినప్పటికీ అదే సమయంలో ప్లేయర్లు మానసికంగా ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు."

-రిజ్వాన్, పాకిస్థాన్ క్రికెటర్​.

యూఏఈ వేదికగా అక్టోబర్​ 17 నుంచి నవంబర్​ 14 వరకు టీ20 వరల్డ్​కప్ జరగనుంది. దీనికి ముందు సీనియర్​ ఆటగాళ్లు ఫిట్​గా ఉండాలని కోరుకుంటున్నారని రిజ్వాన్​ వెల్లడించాడు. ఈ నేపథ్యంలో శ్రీలంక వేదికగా అఫ్గానిస్థాన్​తో జరగనున్న​ వన్డే సిరీస్​కు కెప్టెన్​ బాబర్​ అజామ్​, రిజ్వాన్, ఫాస్ట్​ బౌలర్​ షాహిన్​ షా ఆఫ్రిది,​ హసన్​ అలీకి విశ్రాంతి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై హెడ్​ కోచ్​ మిస్బా ఉల్​ హక్​, చీఫ్​ సెలెక్టర్​ మహ్మద్​ వసీమ్​ చర్చించినట్లు బోర్డు సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి.

ఈ వన్డే సిరీస్​కు సంబంధించి ఈ వారంలో షెడ్యూల్​ను ప్రకటించే అవకాశముంది. ఒకవేళ ఈ నలుగురు ఆటగాళ్లు విశ్రాంతి తీసుకుంటే.. ఓ సిరీస్​కు అధిక సంఖ్యలో సీనియర్ ఆటగాళ్లు దూరంగా ఉండడం పాకిస్థాన్ క్రికెట్​ చరిత్రలో ఇదే తొలిసారి కానుంది.

ఇదీ చదవండి: ఒకే ఇన్నింగ్స్​లో త్రిమూర్తుల శతకాలు..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.