Bajrang Punia Padma Shri Return : భారత స్టార్ రెజ్లర్ బజ్రంగ్ పునియా అత్యున్నత పురస్కారం పద్మశ్రీ అవార్డును వెనక్కి ఇస్తున్నట్లు తెలిపాడు. ఈ విషయమై ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశాడు. డబ్ల్యూఎఫ్ఐ నూతన అధ్యక్షుడిగా సంజయ్ సింగ్ ఎన్నికవడాన్ని నిరసిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు బజ్రంగ్ లేఖలో పేర్కొన్నాడు.
'ప్రియమైన ప్రధాని, మీరు మీ పనుల్లో చాలా బిజీగా ఉంటారు. అయినప్పటికీ మీ దృష్టిని దేశంలోని రెజ్లర్లపైకి తీసుకురావడానికి నేను ఈ లేఖ రాస్తున్నాను. డబ్ల్యూఎఫ్ఐ మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ సింగ్ లైగింక వేధింపుల వల్ల అతడికి వ్యతిరేకంగా దేశంలోని మహిళా రెజ్లర్లు ఈ ఏడాది జనవరిలో నిరసన చేసిన విషయం మీకు తెలిసే ఉంటుంది. నేనూ ఆ నిరసనలో పాల్గొన్నా. అతడిపై చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హామీ ఇచ్చిన తర్వాతే ఆ నిరసన విరమించాం. కానీ, మూడు నెలలు గడిచినా అతడిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. మేము మళ్లీ ఏప్రిలో రోడ్డెక్కాం. దీంతో 19 కేసులకుగాను అతడిపై కేవలం 7 కేసులు నమోదయ్యాయి. అంటే బ్రిజ్ భుషణ్ తన పలుకుబడితో 12మంది మహిళా రెజ్లర్లను భయపెట్టి ఉంటాడు' అని బజ్రంగ్ లేఖలో పేర్కొన్నాడు.
'మా నిరసన 40 రోజులు సాగింది. ఆ సమయంలో మాపై తీవ్ర ఒత్తిడి నెలకొంది. ఓ సమయంలో మేము సాధించిన పతకాలను గంగా నదిలో కలిపేద్దామని డిసైడ్ అయ్యాం. కానీ, ప్రభుత్వం మాకు అండగా నిలుస్తుందని, అతడిపై చర్యలు ఉంటాయని హామీ ఇచ్చిన తర్వాత మా నిర్ణయం మార్చుకున్నాం. ఇక నిన్న (డిసెంబర్ 21)న జరిగిన డబ్లూఎఫ్ఐ ఎన్నికల ఫలితాలు చూస్తే, మళ్లీ రెజ్లింగ్ ఫెడరేషన్ బ్రిజ్ భూషణ్ చేతుల్లోకే వెళ్లిన్నట్లు అనిపిస్తుంది. ఏం చేయాలో మాకు అర్థం అవ్వట్లేదు. ఎక్కడికి వెళ్లాలో తెలియట్లేదు. మాకు ప్రభుత్వం ఎంతో ఇచ్చింది. 2019లో నన్ను పద్మశ్రీతో సత్కరించింది. నేను అర్జునా అవార్డు, ఖేల్‌రత్న కూడా పొందాను. కానీ, మహిళా రెజ్లర్లు భద్రత లేని కారణంగా ఆటను వదిలేయాల్సి వస్తోంది. అయితే మహిళా రెజ్లర్లు అవమానాలు ఎదుర్కొంటున్న సమయంలో, ఓ పద్మశ్రీ అవార్డు గ్రహీతగా నేను బతకలేను. అందుకే నేను అవార్డు మీకు ఇచ్చేస్తున్నా' అని బజ్రంగ్ లేఖలో తన ఆవేదన వ్యక్తం చేశాడు.
-
मैं अपना पद्मश्री पुरस्कार प्रधानमंत्री जी को वापस लौटा रहा हूँ. कहने के लिए बस मेरा यह पत्र है. यही मेरी स्टेटमेंट है। 🙏🏽 pic.twitter.com/PYfA9KhUg9
— Bajrang Punia 🇮🇳 (@BajrangPunia) December 22, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">मैं अपना पद्मश्री पुरस्कार प्रधानमंत्री जी को वापस लौटा रहा हूँ. कहने के लिए बस मेरा यह पत्र है. यही मेरी स्टेटमेंट है। 🙏🏽 pic.twitter.com/PYfA9KhUg9
— Bajrang Punia 🇮🇳 (@BajrangPunia) December 22, 2023मैं अपना पद्मश्री पुरस्कार प्रधानमंत्री जी को वापस लौटा रहा हूँ. कहने के लिए बस मेरा यह पत्र है. यही मेरी स्टेटमेंट है। 🙏🏽 pic.twitter.com/PYfA9KhUg9
— Bajrang Punia 🇮🇳 (@BajrangPunia) December 22, 2023
-
This will break your heart
— Virat Kohli (@IamViratt) December 22, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Champion wrestler #BajrangPunia given up on his Padmashree award & said he can't live with the badge anymore 💔#SakshiMallik #vivekbindrapic.twitter.com/5vSrygKZDm
">This will break your heart
— Virat Kohli (@IamViratt) December 22, 2023
Champion wrestler #BajrangPunia given up on his Padmashree award & said he can't live with the badge anymore 💔#SakshiMallik #vivekbindrapic.twitter.com/5vSrygKZDmThis will break your heart
— Virat Kohli (@IamViratt) December 22, 2023
Champion wrestler #BajrangPunia given up on his Padmashree award & said he can't live with the badge anymore 💔#SakshiMallik #vivekbindrapic.twitter.com/5vSrygKZDm
Sakshi Malik Retirement : ఇక ఎన్నికల ఫలితాలు రాగానే స్టార్ రెజ్లర్ సాక్షి మాలిక్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఫలితాల పట్ల అసహనం వ్యక్తం చేస్తూ, తను రెజ్లింగ్‌కు రిటైర్మెట్ ప్రకటించింది. 'తాజా ఎన్నికల్లో బ్రిజ్ భూషణ్ వ్యాపార భాగస్వామి, సన్నిహితుడు డబ్ల్యుఎఫ్‌ఐ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. మేము మహిళా అధ్యక్షురాలిని కోరుకున్నాము కానీ అది జరగలేదు. అందుకే నేను రెజ్లింగ్‌కు వీడ్కోలు పలుకుతున్నా' అంటూ సాక్షి భావోద్వేగానికి లోనైంది.
-
#SaksheeMalikkh #SakshiMallik @SakshiMalik 💔 pic.twitter.com/SQU4gEUwSD
— Ritika Singh (@ritika_offl) December 22, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">#SaksheeMalikkh #SakshiMallik @SakshiMalik 💔 pic.twitter.com/SQU4gEUwSD
— Ritika Singh (@ritika_offl) December 22, 2023#SaksheeMalikkh #SakshiMallik @SakshiMalik 💔 pic.twitter.com/SQU4gEUwSD
— Ritika Singh (@ritika_offl) December 22, 2023
నిర్ణయం వెనక్కి తీసుకోవాలని కోరుతున్నాం : పద్మశ్రీ అవార్డును వెనక్కి ఇచ్చేయాలన్న తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని క్రీడా శాఖ బజ్‌రంగ్‌ను కోరినట్లు తెలుస్తోంది. అయితే సమాఖ్య ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగానే జరిగినట్లు సంబంధింత మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి.
'బ్రిజ్ భూషణ్ అనుచరుల పాలనలో పోటీ చేయలేను'- సాక్షి మాలిక్ రిటైర్మెంట్
బ్రిజ్ భూషణ్ అనుచరుడికి పగ్గాలు - రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడిగా సంజయ్ సింగ్