Asian Games 2023 Cricket : ఆసియా క్రీడల్లో భాగంగా జరగుతున్న ఈవెంట్లలో తాజాగా పురుషుల క్రికెట్ ఆరంభమైంది. మంగళవారం ఉదయం భారత్-నేపాల్ మధ్య మ్యాచ్ జరిగింది. ఇందులో ఇరు జట్లు హోరా హోరీగా ఆడినప్పటికీ.. విజయం భారత జట్టుకే దక్కింది. 23 పరుగుల తేడాతో గైక్వాడ్ సేన.. సెమీస్‌కు దూసుకెళ్లింది. భారత జట్టులోని యంగ్ ప్లేయర్ యశస్వి సెంచరీ సాధించి చెలరేగాడు. ఇక అతడితోపాటు రింకు సింగ్ (37) దూకుడుగా ఆడి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. ఇక రుతురాజ్ గైక్వాడ్ (25), శివమ్ దూబె (25) కూడా విలువైన పరుగులు సాధించారు.
-
🇮🇳 MEN'S CRICKET UPDATE🏏 #AsianGames2022#TeamIndia has secured a spot in the semi-finals with a 23-run victory against Nepal! 🎉🙌
— SAI Media (@Media_SAI) October 3, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
🌟 @ybj_19's spectacular century stole the show with 100 runs in just 49 balls, including 8 fours and 7 sixes! 💯🔥
🎯 On the bowling front,… pic.twitter.com/gYNRrwo9vG
">🇮🇳 MEN'S CRICKET UPDATE🏏 #AsianGames2022#TeamIndia has secured a spot in the semi-finals with a 23-run victory against Nepal! 🎉🙌
— SAI Media (@Media_SAI) October 3, 2023
🌟 @ybj_19's spectacular century stole the show with 100 runs in just 49 balls, including 8 fours and 7 sixes! 💯🔥
🎯 On the bowling front,… pic.twitter.com/gYNRrwo9vG🇮🇳 MEN'S CRICKET UPDATE🏏 #AsianGames2022#TeamIndia has secured a spot in the semi-finals with a 23-run victory against Nepal! 🎉🙌
— SAI Media (@Media_SAI) October 3, 2023
🌟 @ybj_19's spectacular century stole the show with 100 runs in just 49 balls, including 8 fours and 7 sixes! 💯🔥
🎯 On the bowling front,… pic.twitter.com/gYNRrwo9vG
India Vs Nepal Asian Games : లక్ష్య ఛేదనలో నేపాల్ కూడా దూకుడుగానే ఆడింది. అయినప్పటికీ.. నిర్ణీత 20 ఓవర్లలో 179/9 స్కోరుకు పరిమితమైంది. హ్యాట్రిక్ సిక్స్‌ల దీపేంద్ర సింగ్ ఐరీ (32) పరుగులతో చెలరేగి.. జట్టులో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇక నేపాల్ టీమ్‌లో కుశాల్ మల్లా (29), సందీప్ జొరా (29), కుశాల్ భుర్టెల్ 928), కరన్ (18*) ఫర్వాలేదనిపించారు. మరోవైపు భారత బౌలర్లు రవి బిష్ణోయ్ 3, అర్ష్‌దీప్ సింగ్ 2, అవేశ్ ఖాన్ 3, సాయి కిశోర్ ఒక వికెట్ పడగొట్టారు.
శతకంతో జైస్వాల్ దూకుడు.. భారత్ ఖాతాకు అరుదైన రికార్డు..
Yashasvi Jaiswal Asian Games : బ్యాటింగ్ ఎంచుకుని రంగంలోకి దిగిన భారత జట్టుకు ఓపెనర్లుగా రిగిన రుతురాజ్ గైక్వాడ్ (25), యశస్వి జైస్వా్ల్ మంచి స్కోర్‌ను అందించారు. తొలి వికెట్ సమయానికే శతక (103) భాగస్వామ్యాన్ని నిర్మించారు. ఈ క్రమంలో జైస్వాల్ ఓ అరుదైన రికార్డును అందుకున్నాడు. అంతర్జాతీయ టీ20ల్లో తొలి సెంచరీ నమోదు చేసి.. పురుషుల టీ20 క్రికెట్ చరిత్రలో సెంచరీ కొట్టిన అతి పిన్న వయస్కుడిగా రికార్డుకెక్కాడు. 21 సంవత్సరాల 279 రోజుల వయస్సులో అతడు ఈ ఘనతను సాధించాడు. అంతే కాకుండా ఆసియా క్రీడల్లో మొదటి సెంచరీ చేసిన భారతీయుడిగా నిలిచాడు.
ఇక భారత్ తరఫున టీ20 ఫార్మాట్ లో సెంచరీలు చేసిన అతి చిన్న వయస్సులైన బ్యాటర్ల జాబితాలో సురేశ్ రైనా, శుభ్‌మన్ గిల్, కేఎల్ రాహుల్ కూడా ఉన్నారు. గిల్ 23ఏళ్ల 146 రోజుల వయస్సులో సెంచరీ చేయగా, సురేశ్ రైనా 23ఏళ్ల 156 రోజుల వయస్సులో శతకాన్ని బాదాడు. కేఎల్ రాహుల్ 24 ఏళ్ల 131 రోజుల వయస్సులో ఈ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">