Asia Cup 2023 : 2023 ప్రపంచకప్‌నకు ప్రస్తుత ఆసియాకప్ టోర్నమెంట్ సెమీఫైనల్‌గా భావించి.. బలాబలాలను పరీక్షించుకోవచ్చని భారత్ అనుకుంది. కానీ ఈ అంచనాలను తలకిందులు చేస్తూ.. ప్రణాళికలన్నింటినీ వరుణుడు దెబ్బతీసేలా కనిపిస్తున్నాడు. ఈ మినీటోర్నీకి పాకిస్థాన్‌కు ప్రత్యామ్నాయ వేదికగా శ్రీలంకను ఎంచుకోవడమే.. బీసీసీఐ తప్పిదమా అన్న ప్రశ్న తలెత్తే పరిస్థితి ఏర్పడింది.
గాయాల నుంచి కోలుకొని.. జట్టులోకి రీ ఎంట్రీ ఇచ్చిన ప్లేయర్లకు పరీక్షలా నిలుస్తుందని, వరల్డ్ కప్‌నకు ముందు ఈ టోర్నీ ఓ ప్రాక్టీస్‌లా ఉపయోగపడుతుందని భావించింది టీమ్ఇండియా. కానీ వాస్తవంలో జరుగుతున్నది వేరు. ఎలాంటి అంతరాయం లేకుండా టీమ్ఇండియా ఒక్క మ్యాచ్‌ను కూడా ముగించే పరిస్థితి కనిపించడం లేదు. ఫ్యాన్స్ ఎప్పటినుంచే ఆత్రుకగా ఎదురుచూసిన ఇండోపాక్ మ్యాచ్ కూడా వర్షం కారణంగా తుడిచిపెట్టుకుపోయింది. ఈ మ్యాచ్‌లో భారత్‌కు బౌలింగ్ చేసే అవకాశమే రాలేదు. ఎన్నో అంచనాలతో జట్టులోకి రీ ఎంట్రీ ఇచ్చిన బుమ్రా ఇప్పటివరకూ ఆసలు వన్డే మ్యాచ్ ఆడనేలేదు.
Asia Cup 2023 Schedule : అయితే ఇప్పటి నుంచి టోర్నమెంట్లో సూపర్ 4 మ్యాచ్‌లన్నీ.. కొలొంబోలో జరగనున్నాయి. ఫైనల్ మ్యాచ్‌కు సైతం కొలొంబోనే వేదిక కానుంది. కానీ ప్రస్తుత వర్షాలు.. కొలొంబోనూ ముంచెత్తుతున్నాయి. సెప్టెంబర్ 10న జరగాల్సిన భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌పైనా వర్షం ప్రభావం ఉండే అవకాశాలు ఉన్నాయి. దీంతో టీమ్ఇండియా ఫ్యాన్స్ మళ్లీ అందోళన చెందుతున్నారు. ఆ ఒక్క మ్యచ్కే కాకుండా.. సూపర్ 4తో సహా ఫైనల్‌కూ వర్షం ముప్పు పొంచి ఉండడం వల్ల టోర్నీనే తుడిచిపెట్టుకుపోయే ప్రమాదం ఉంది. వర్షాల కారణంగా ప్రాక్టీస్ సైతం ఇండోర్‌కే పరిమితమైంది. దీంతో ఈ టోర్నీని.. వరల్డ్ కప్‌నకు ప్రాక్టీస్‌గా భావించిన ఆసియా ఖండపు జట్లన్నింటికీ ఇది నిరాశ కలిగించే విషయమే. చూడాలి మరి ఏం జరుగుతుందో..
Ind Vs Pak Asia Cup : టీమ్ఇండియా తుది జట్టు (అంచనా) :
రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్ మన్ గిల్, విరాట్ కోహ్లి, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, జడేజా, బుమ్రా, షమీ, శ్రేయస్ అయ్యర్/కేఎల్ రాహుల్, కుల్దీప్ యాదవ్, సిరాజ్