Asia Cup 2023 : ఈ ఏడాది భారత్ వేదికగా జరగనున్న వన్డే ప్రపంచ కప్‌నకు సన్నాహకంగా భావిస్తున్న ప్రతిష్టాత్మక ఆసియా కప్ బుధవారం నుంచి ప్రారంభం కానుంది. పాకిస్థాన్, శ్రీలంక వేదికగా దాదాపు నాలుగు స్టేడియంలో ఆసియా కప్ మ్యాచ్‌లు జరగనున్నాయి. పాక్‌లోని ముల్తాన్, లాహోర్‌తో పాటు శ్రీలంకలో పల్లెకెల్లె, కొలొంబో స్టేడియాలు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. ఇక ఈ మెగా టోర్నీ కోసం బెంగళూర్‌లో టీమ్ఇండియా ముమ్మరంగా సాధన చేసింది .
Asia Cup 2023 Schedule : మరోవైపు ఈ ఆసియాకప్ కోసం ఆరు దేశాలు పోటీపడనున్నాయి. ఆగస్టు 30 మధ్యాహ్నం జరగనున్న తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్ - నేపాల్ తలపడనుండగా.. ఈ మ్యాచ్ బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం కానుంది. అయితే ఇప్పటి వరకు కేవలం రెండుసార్లు టీ20 ఫార్మాట్‌లో జరిగిన ఆసియా కప్.. ఇప్పుడు మళ్లీ వన్డే ఫార్మాట్‌లో జరగనుంది.
Asia Cup 2023 Format : గతేడాది పొట్టి ఫార్మాట్‌లో జరిగిన ఆసియా కప్‌ను శ్రీలంక గెలుచుకోగా.. ఇప్పటి వరకు భారత్ అత్యధికంగా ఏడుసార్లు ఆసియాకప్‌లో విజేతగా నిలిచింది. దీంతో ఈసారి కూడా నాలుగు జట్ల నుంచి తీవ్ర పోటీ నెలకొంది. భారత్, పాకిస్థాన్‌తో పాటు శ్రీలంక, బంగ్లాదేశ్ ఈ రేసులో ఉన్నాయి. వన్డే ప్రపంచకప్ నేపథ్యంలో ప్రతి జట్టూ తమ శక్తిసామర్థ్యాలను పరీక్షించుకునేందుకు ఇదొక వేదికగా మార్చుకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Asia Cup 2023 Teams : భారత్, పాకిస్థాన్, నేపాల్ గ్రూప్-ఏలో, శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్ గ్రూప్-బిలో ఉన్నాయి. ఈ రెండు గ్రూపుల్లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సూపర్-4కు అర్హత సాధిస్తాయి. గ్రూప్ దశలో భారత్ సెప్టెంబర్ 2న పాకిస్థాన్‌తోనూ, సెప్టెంబర్-4న నేపాల్‌తోనూ తలపడనుంది. రోహిత్‌శర్మ నేతృత్వంలో భారత జట్టు ఈ టోర్నీలో అదృష్టం పరీక్షించుకోనుంది. గాయం కారణంగా పాకిస్థాన్, నేపాల్‌తో జరిగే తొలి రెండు మ్యాచ్‌లకు కేఎల్ రాహుల్ దూరంకానున్నాడు. ఇషాన్ కిషన్ వికెట్ కీపింగ్ బాధ్యతలు నిర్వర్తించనున్నాడు.
-
Prep mode 🔛
— BCCI (@BCCI) August 29, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Energy levels high 💪
Getting into the groove in Alur 👌#TeamIndia | #AsiaCup2023 pic.twitter.com/rHBZzbf4WT
">Prep mode 🔛
— BCCI (@BCCI) August 29, 2023
Energy levels high 💪
Getting into the groove in Alur 👌#TeamIndia | #AsiaCup2023 pic.twitter.com/rHBZzbf4WTPrep mode 🔛
— BCCI (@BCCI) August 29, 2023
Energy levels high 💪
Getting into the groove in Alur 👌#TeamIndia | #AsiaCup2023 pic.twitter.com/rHBZzbf4WT
Asia Cup 2023 IND VS PAK : భారత్‌తో మ్యాచ్.. మాకు కావాల్సింది అదే బాసు అంటున్న పాక్ కెప్టెన్
Asia Cup 2023 Covid : ఆసియా కప్‌నకు కొవిడ్ ముప్పు.. అక్కడ్నుంచే వ్యాప్తి చెందిందా?