భారత్-పాకిస్థాన్ ద్వైపాకిక్ష సిరీస్ అంటే ఎంతటి ఆసక్తి ఉంటుందో ఆస్ట్రేలియా-ఇంగ్లాండ్(Aus vs Eng Ashes 2021) మధ్య జరిగే యాషెస్ సిరీస్‌కూ అంతే ఆసక్తి ఉంటుంది. ఈ రెండు టోర్నీలను ఆయా దేశాలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడమే ఇందుకు కారణం. ప్రస్తుతం ఈ ఏడాది యాషెస్‌కు సమయం దగ్గరపడింది. డిసెంబర్ 8న గబ్బా వేదికగా ఆసీస్-ఇంగ్లాండ్ మధ్య తొలి టెస్టు జరగనుంది. ఈ నేపథ్యంలో ఈ టోర్నీ అధికారిక బ్రాడ్‌కాస్టర్‌గా ఉన్న సోనీ పిక్చర్స్ స్పోర్ట్స్ నెట్వర్క్ కీలక నిర్ణయం తీసుకుంది.
Ashes 2021 Broadcast in India: ఈ ఏడాది జరగబోయే యాషెస్ మ్యాచ్‌లను భారత్‌లో నాలుగు భాషల్లో ప్రసారం చేసేందుకు సిద్ధమైంది సోనీ పిక్చర్స్ స్పోర్ట్స్ నెట్వర్క్. ఇంగ్లీష్ (సోనీ సిక్స్), హిందీ (సోనీ టెన్ 3), తెలుగు, తమిళం (సోనీ టెన్ 4)ల్లో ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. ప్రేక్షకుల కోరిక మేరకు సోనీ లివ్ ఓటీటీలోనూ ఈ మ్యాచ్‌లను ప్రసారం చేయనున్నారు. ఈ టోర్నీని భారత్‌లో నాలుగు భాషల్లో ప్రసారం చేయడం ఇదే తొలిసారి కావడం విశేషం.
కామెంటేటర్స్ వీరే..
Ashes Commentatory in Hindi: వివేక్ రజ్దాన్, సబా కరీమ్, అతీష్ తుక్రాల్, రమన్ భానోత్, స్నేహల్ ప్రధాన్, రీతిందర్ సింగ్ సోధి
Ashes Commentatory in Tamil: లక్ష్మణ్ శివరామకృష్ణన్, వూర్కేరీ రమన్, విద్యుత్ శివరామకృష్ణన్, టి.అరసు, ఎస్.శేషాద్రి, అరుణ్ వేణుగోపాల్, ఆర్తి శంకరన్, సునీల్ విశ్వనాథన్
Ashes Commentatory in Telugu: కీర్తి విశ్వనాథన్, ప్రేమ్ సాగర్, విజయ్ మహవాడి, సుధీర్ మహవాడి, ఆర్జే హేమంత్, వెంకటపతి రాజు, సి.వెంకటేశ్, సందీప్ కుమార్
ఈ టోర్నీ ప్రారంభానికి ముందు ఆస్ట్రేలియా జట్టులో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. తోటి సహోద్యోగురాలికి అసభ్యకర సందేశాలు పంపిన కారణంగా టిమ్ పైన్ ఆసీస్ కెప్టెన్ బాధ్యతల నుంచి తప్పుకొంటున్నట్లు ఇటీవలే ప్రకటించాడు. దీంతో ఇతడి స్థానంలో పేసర్ పాట్ కమిన్స్‌కు సారథ్యం అప్పగించింది ఆసీస్ క్రికెట్ బోర్డు. సీనియర్ క్రికెటర్ స్టీవ్ స్మిత్ అతడికి డిప్యూటీగా ఉంటాడని వెల్లడించింది. అలాగే, ఇంగ్లాండ్ కూడా ఈ సిరీస్ కోసం చెమటోడుస్తోంది. ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ చేరికతో జట్టు బలంగా మారింది.