ETV Bharat / sports

Ashes 2021: కష్టాల్లో ఇంగ్లాండ్.. రెండో ఇన్నింగ్స్​లో 31/4 - యాషెస్ 2021 మూడో టెస్టు లైవ్ న్యూస్

Ashes 2021: యాషెస్ సిరీస్​ను కోల్పోయే ప్రమాదంలో పడింది ఇంగ్లాండ్. ఇప్పటికే తొలి రెండు టెస్టుల్లో ఓడిపోయిన ఇంగ్లీష్ జట్టు మూడో టెస్టులోను ఓటమికి దగ్గరైంది. ఈ మ్యాచ్​లో రెండో రోజు ఆటముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్​లో 31 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది రూట్​సేన.

Ashes 2021 3rd test live, Ashes 2021 3rd test Ashes 2021 3rd test latest news, యాషెస్ మూడో టెస్టు స్కోర్ కార్డ్, యాషెస్ మూడో టెస్టు లైవ్ న్యూస్
Ashes 2021
author img

By

Published : Dec 27, 2021, 3:13 PM IST

Ashes 2021: యాషెస్ సిరీస్​లో ఇప్పటికే రెండు టెస్టుల్లో ఓడిపోయి ఒత్తిడిలో పడిపోయిన ఇంగ్లాండ్ మూడో టెస్టులోనూ ఓటమికి దగ్గరవుతోంది. మెల్​బోర్న్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్​లో ఆస్ట్రేలియా విజయం దిశగా సాగుతోంది. తొలి ఇన్నింగ్స్​లో ఇంగ్లీష్ జట్టు 185 పరుగులకు ఆలౌటవ్వగా.. ఆసీస్ 267 పరుగులు సాధించింది. దీంతో మొదటి ఇన్నింగ్స్​లో కంగారూ జట్టుకు 82 పరుగుల ఆధిక్యం లభించింది. మార్కస్ హారిస్ (76) అర్ధశతకంతో రాణించాడు.

ఇక రెండు రోజు ఆట ముగిసే సమయానికి కీలకమైన నాలుగు వికెట్లు కోల్పోయి ఇబ్బందుల్లో పడింది ఇంగ్లాండ్. హమీద్ (7), క్రాలే (5), మలన్ (0), జాక్ లీచ్ (0) దారుణంగా విఫలమయ్యారు. దీంతో 22 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి ఇబ్బందుల్లో పడింది ఇంగ్లీష్ జట్టు. అనంతరం క్రీజులోకి వచ్చిన కెప్టెన్ రూట్ (12*)తో కలిసి ఆల్​రౌండర్ స్టోక్స్ (2*) ఇన్నింగ్స్​ను చక్కదిద్దే పనిలో పడ్డారు. దీంతో 31/4తో రెండో రోజును ముగించింది ఇంగ్లాండ్. ప్రస్తుతానికి ఆసీస్ 51 పరుగుల ఆధిక్యంలో ఉంది.

ఇవీ చూడండి: 'నా ఔట్​పై స్పందిస్తే.. డబ్బులు పోగొట్టుకోవడమే'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.