Buttler Hit Wicket: యాషెస్ సిరీస్‌లో భాగంగా ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో టెస్టులో ఆస్ట్రేలియా ఘనవిజయం సాధించింది. ఈ మ్యాచ్‌ను డ్రా చేసుకునేందుకు ఇంగ్లీష్ జట్టు పోరాడినా ఫలితం లేకపోయింది. ఈ జట్టు స్టార్ బ్యాటర్ బట్లర్ కూడా చాలా గొప్పగా పోరాడాడు. 207 బంతులాడి 26 పరుగులు చేశాడు. ఈ క్రమంలోనే ఎంతో పట్టుదల చూపించాడు. ఆసీస్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్న ఇతడు ఇంగ్లీష్ జట్టును డ్రాతో గట్టెక్కించే ప్రయత్నం చేశాడు. కానీ అనూహ్య రీతిలో ఔటై జట్టుకు నిరాశ మిగిల్చాడు.
ఏం జరిగింది?
అప్పటికీ 8 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసి ఓటమికి దగ్గరైంది ఇంగ్లాండ్. ఓవైపు వికెట్లు పడుతున్నా బట్లర్ మాత్రం ఆసీస్ బౌలర్ల సహనానికి పరీక్ష పెట్టాడు. కానీ రిచర్డ్సన్ వేసిన 110వ ఓవర్లో అనూహ్యంగా ఔటయ్యాడు. బంతిని బ్యాక్ ఫుట్ ఆడే క్రమంలో అతడి పాదం వికెట్లను తాకింది. దీంతో హిట్ వికెట్‌గా వెనుదిరిగాడు బట్లర్. అంతే ఆసీస్ శిబిరం ఆనందోత్సవాల్లో మునిగిపోయింది. ఎంతో పట్టుదలతో ఆడిన ఈ ఇంగ్లాండ్ వికెట్ కీపర్.. ఇంత చెత్తగా ఔటవ్వడం పట్ల అభిమానులు నిరాశ చెందారు.
-
Jos Buttler Hit Wicket Today 😯😯#JosButtler #Butter #AUSvENG #ENGvsAUS pic.twitter.com/saNJ7Jsc4p
— Cricket Countdown (@Cric8Countdown) December 20, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">Jos Buttler Hit Wicket Today 😯😯#JosButtler #Butter #AUSvENG #ENGvsAUS pic.twitter.com/saNJ7Jsc4p
— Cricket Countdown (@Cric8Countdown) December 20, 2021Jos Buttler Hit Wicket Today 😯😯#JosButtler #Butter #AUSvENG #ENGvsAUS pic.twitter.com/saNJ7Jsc4p
— Cricket Countdown (@Cric8Countdown) December 20, 2021
అనంతరం మరో 10 పరుగులు చేసి ఆలౌటైంది ఇంగ్లాండ్. దీంతో ఆస్ట్రేలియా 275 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. సిరీస్‌లో 2-0 తేడాతో ఆధిక్యంలో నిలిచింది. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ, రెండో ఇన్నింగ్స్‌లో అర్ధసెంచరీతో మెరిసిన లబుషేన్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ లభించింది.