ETV Bharat / sports

తిరగబెట్టిన గాయం.. కివీస్​తో సిరీస్​కు ఆర్చర్​ దూరం - గాయం కారణంగా ఆర్చర్ దూరం

జూన్​ 2 నుంచి న్యూజిలాండ్​తో ప్రారంభమయ్యే టెస్టు సిరీస్​కు ఇంగ్లాండ్ ఆల్​రౌండర్​ జోఫ్రా ఆర్చర్​ దూరమయ్యాడు. గాయం తిరగబెట్టడం వల్లే తప్పుకుంటున్నట్లు ఇంగ్లాండ్ అండ్ వేల్స్​ క్రికెట్ బోర్డు ప్రకటించింది.

jofra archer, england all rounder
జోఫ్రా ఆర్చర్​, ఇంగ్లాండ్ ఆల్​రౌండర్
author img

By

Published : May 17, 2021, 3:59 PM IST

న్యూజిలాండ్​తో టెస్టు సిరీస్​కు ముందు ఇంగ్లాండ్​ జట్టుకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. గాయం కారణంగా ఆల్​రౌండర్ జోఫ్రా ఆర్చర్​ సిరీస్​ నుంచి వైదొలిగాడు. ఈ విషయాన్ని ఇంగ్లాండ్ అండ్ వేల్స్​ క్రికెట్ బోర్డు అధికారికంగా ప్రకటించింది.

ఇటీవల కౌంటీల్లో ససెక్స్​ జట్టుకు ఆడిన ఆర్చర్​.. కేవలం 5ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేశాడు. ఈ మ్యాచ్​కు ముందు గత వారం సర్రేతో జరిగిన మ్యాచ్​లో 29.2 ఓవర్లు బౌలింగ్ చేశాడు జోఫ్రా. తాను ఫిట్​గా ఉన్నానని.. ఐపీఎల్​ తిరిగి ప్రారంభమైతే ఆడటానికి సిద్ధమని ప్రకటించాడు. కానీ ఇంతలోనే గాయం మరోసారి తిరగబెట్టింది.

భారత్​తో జరిగిన నాలుగు టెస్టుల సిరీస్​లో కేవలం రెండు మ్యాచ్​లే ఆడాడు ఆర్చర్​. గాయం కారణంగా మధ్యలోనే తప్పుకున్నాడు. ఐపీఎల్​కు కూడా దూరమయ్యాడు.

ఇదీ చదవండి: 'మా వాళ్లను క్షేమంగా పంపారు.. థ్యాంక్యూ బీసీసీఐ'

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.