టీమ్ఇండియా ప్రస్తుత కెప్టెన్ కోహ్లి, మాజీ సారథి ధోని మంచి స్నేహితులు. మైదానం బయట కూడా ఎంతో సన్నిహితంగా మెలుగుతారు. వీళ్లే కాదు వీళ్ల భార్యలు కూడా మంచి మిత్రులే.. అది కూడా చిన్నతనం నుంచే. అవును.. కోహ్లి భార్య అనుష్క, ధోని సతీమణి సాక్షి ఒకే పాఠశాలలో ఒకే తరగతిలో కూర్చుని చదువుకున్నారు.
గతంలో వాళ్లు కలిసి ఉన్న ఫొటోలు.. ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. అనుష్క తండ్రి రిటైర్డ్ కల్నల్ అజయ్ కుమార్ సైన్యంలో ఉన్నపుడు అసోంలో బాధ్యతలు నిర్వర్తించాడు. అప్పుడు ఆమె అక్కడ ఉన్న సెయింట్ మేరీస్ పాఠశాలకు వెళ్లేది. సాక్షి కూడా అక్కడే చదువుకునేది. ఇలా ఈ ఇద్దరూ అప్పుడే స్నేహితులయ్యారు. గతంలో ఓ ఇంటర్వ్యూ సందర్భంగా సాక్షి, తను ఒకే తరగతిలో చదువుకున్నామని అనుష్క వెల్లడించింది.
ఇదీ చదవండి: ఇంగ్లాండ్ పర్యటనకు భారత మహిళల జట్టు ఇదే