ETV Bharat / sports

Ajit Agarkar Team Selection : 'అందుకే చాహల్​ను తప్పించాం.. ధావన్ మంచి ప్లేయరే కానీ' - ఆసియా కప్​కు ఎంపికైన తిలక్

Ajit Agarkar Team Selection : ఆసియ కప్​2023 కోసం టీమ్ఇండియా జట్టును సోమవారం ప్రకంటించింది బీసీసీఐ. కాగా ఎంపిక చేసిన ఈ జట్టుపై.. మీడియా అడిగిన పలు ప్రశ్నలకు సెలెక్షన్ కమిటీ ఛైర్మన్ అజిత్ అగార్కర్ క్లారిటీ ఇచ్చాడు.

Ajit Agarkar Team Selection
Ajit Agarkar Team Selection
author img

By

Published : Aug 21, 2023, 7:04 PM IST

Ajit Agarkar Team Selection : ఆసియా కప్ 2023 టోర్నమెంట్​ కోసం టీమ్ఇండియా జట్టును బీసీసీఐ సోమవారం ప్రకటించింది. స్టాండ్​బై ఆటగాడితో పాటు మొత్తం 18 మంది ఆటగాళ్లను ఎంపిక చేసింది. చాలా కాలం నుంచి నిలకడగా రాణిస్తున్న యుజ్వేంద్ర చాహల్​కు ఈ జట్టులో చోటు దక్కలేదు. అయితే జట్టు ప్రకటన ఈ సందర్భంగా.. కెప్టెన్​ రోహిత్​ శర్మతో పాటు సెలెక్షన్ కమిటీ ఛైర్మన్​ అజిత్ అగార్కర్​ మీడియాతో మాట్లాడారు. జట్టు కూర్పుపై ఈ ప్రెస్​మీట్​లో వివరణ ఇచ్చారు.

చాహల్​పై వేటు..
Yuzvendra Chahal : టీమ్ఇండియా జట్టులో గత కొద్ది కాలంగా అద్భుతమైన ప్రదర్శన చేస్తున్న చాహల్​ను.. దురదృష్టవశాత్తు వదులుకోవాల్సి వచ్చిందని ఆగార్కర్ అన్నాడు. కానీ ఇప్పుడున్న జట్టులో అతడి కంటే కుల్​దీప్ యాదవ్ మెరుగ్గా ఆడుతున్నాడని ఆయన తెలిపాడు. ఇక ఇద్దరు రిస్ట్ స్పిన్నర్లను ఎంపిక చేసే పరిస్థితి ప్రస్తుతం లేదని.. అందుకే అక్షర్ పటేల్​ను తీసుకున్నట్లు ఆగార్కర్​ పేర్కొన్నాడు. అయితే రానున్న ప్రపంచకప్​కు దాదాపు ఇదే జట్టును ఎంపిక చేయవచ్చన్న కథనాలు వస్తున్న వేళ.. చాహల్​కు ఇంకా అవకాశాలు ఉన్నాయని రోహిత్ స్పష్టం చేశాడు.

Shikhar Dhawan : ప్రెస్​మీట్​లో టీమ్ఇండియా సీనియర్ ప్లేయర్ శిఖర్ ధావన్ గురించి మీడియా అడగ్గా.. "అవును ధావన్ నాణ్యమైన ఆటగాడే. కానీ ప్రస్తుతం మాకు ముగ్గురు ఓపెనర్లు అందుబాటులో ఉన్నారు. వారంతా అద్భుతంగా రాణిస్తున్నారు" అని అగార్కర్ అన్నాడు.

Sanju Samson : ఇక శ్రేయస్ అయ్యర్, కే ఎల్​ రాహుల్​ గాయాల నుంచి కోలుకున్నారు. శ్రేయస్ పూర్తి ఫిట్​నెస్ సాధించాడు. రాహుల్ కూడా ఫిట్​నెస్​పై శ్రద్ధ పెడుతున్నాడని అగార్కర్ తెలిపాడు. అయినప్పటికీ ముందుజాగ్రత్తగా శాంసన్​ను రిజర్వ్​ ప్లేయర్​గా జట్టులో తీసుకున్నట్లు ఆగార్కర్​ స్పష్టం చేశాడు.

Tilak Varma Asia Cup : ఇప్పటికీ వన్డేల్లో అరంగేట్రం చేయకున్నా సెలక్టర్లు తిలక్ వర్మకు మొగ్గుచూపారు. ఆసియా కప్​లో రాణిస్తే.. మెగాటోర్నీకి కూడా తిలక్ సెలెక్ట్ ఛాన్స్​లు ఉన్నాయంటూ పలువురు మాజీలు అభిప్రాయపడుతున్నారు.

Prasidh Krishna Asia Cup : ప్రస్తుతం ఐర్లాండ్ పర్యటనలో నిలకడగా రాణిస్తున్న పేసర్ ప్రసిద్ కృష్ణకు పిలుపు అందింది. కాగా ఐర్లాండ్​తో రెండు టీ20 మ్యాచ్​ల్లో ప్రసిద్ 4 వికెట్లు తీశాడు.

Asia Cup Team India Players list 2023 : జట్టు ప్రకటించిన బీసీసీఐ.. కెప్టెన్​గా రోహిత్​ శర్మ.. హైదరాబాదీ క్రికెటర్​కు చోటు

ODI World Cup 2023 Hyderabad Schedule : ఉప్పల్‌ మ్యాచ్‌ రీ షెడ్యూల్‌ పై స్పందించిన బీసీసీఐ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.