బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల పుట్టిన రోజు నేడు. ఈ వేడుకను తన ప్రియుడు, నటుడు విష్ణు విశాల్‌తో కలిసి హైదరాబాద్‌లో జరుపుకొంది. జ్వాలను ఆశ్చర్యపరిచేందుకు విష్ణు హైదరాబాద్ వెళ్లి.. ఆమెకు ఎంగేజ్మెంట్ రింగ్‌తో ప్రపోజ్ చేశాడు. ఈ క్రమంలోనే వారిద్దరూ కలిసి తీసుకున్న ఫొటోలను, నిశ్చితార్థపు ఉంగరాన్ని సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నాడు విష్ణు.
-
Happy birthday @Guttajwala
— VISHNU VISHAL - stay home stay safe (@TheVishnuVishal) September 7, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
New start to LIFE..
Lets be positive and work towards a better future for us,Aryan,our families,friends and people around..
Need all your love n blessings guys..#newbeginnings
thank you @basanthjain for arranging a ring in d middle of d night.. pic.twitter.com/FYAVQuZFjQ
">Happy birthday @Guttajwala
— VISHNU VISHAL - stay home stay safe (@TheVishnuVishal) September 7, 2020
New start to LIFE..
Lets be positive and work towards a better future for us,Aryan,our families,friends and people around..
Need all your love n blessings guys..#newbeginnings
thank you @basanthjain for arranging a ring in d middle of d night.. pic.twitter.com/FYAVQuZFjQHappy birthday @Guttajwala
— VISHNU VISHAL - stay home stay safe (@TheVishnuVishal) September 7, 2020
New start to LIFE..
Lets be positive and work towards a better future for us,Aryan,our families,friends and people around..
Need all your love n blessings guys..#newbeginnings
thank you @basanthjain for arranging a ring in d middle of d night.. pic.twitter.com/FYAVQuZFjQ
"హ్యాపీ బర్త్‌డే జ్వాల. సరికొత్త ఆరంభం ఇది. మన భవిష్యత్తు కోసం మరింత సానుకూలతతో ముందుకు వెళ్దాం. ఆర్యన్, ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అందరి ఆశీస్సులు మాకు కావాలి. అర్ధరాత్రి నాకు ఈ ఉంగరాన్ని ఏర్పాటు చేసినందుకు బసంత్ జైన్‌కు కృతజ్ఞతలు."
-విష్ణు విశాల్, సినీ నటుడు
రెండేళ్లుగా విష్ణు, జ్వాల ప్రేమలో ఉన్నారు. తరచూ ఈ జంట తమ ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో అభిమానులతో షేర్ చేసుకుంటుంది. నిశ్చితార్థం అనంతరం మీడియాతో మాట్లాడిన విష్ణు.. "జ్వాల పుట్టిన రోజును ప్రత్యేకంగా ఎప్పటికీ గుర్తుండిపోయేలా చేయాలనుకున్నా. అలా ఆమెను ఆశ్చర్యపరిచేలా ఎంగేజ్మెంట్ రింగ్‌తో ప్రపోజ్ చేశా. అదృష్టం కొద్దీ అవును అని చెప్పి నన్నే ఆశ్చర్యపరిచింది." అని పేర్కొన్నాడు. దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టిన తర్వాత.. ఈ జంట పెళ్లిపీటలెక్కనున్నట్లు సమాచారం.
విష్ణు గతంలో రజనీ నటరాజన్‌ను వివాహం చేసుకోగా.. వారికి ఆర్యన్ అనే అబ్బాయి పుట్టాడు. 2018లో ఈ జంట విడాకులు తీసుకుంది. కాగా గుత్తా జ్వాల.. చేతన్ ఆనంద్‌ను వివాహమాడగా.. 2011లో ఇరువురి మనసులు కలవక విడిపోయారు.