వియత్నాం ఓపెనలో భారత యువ షట్లర్ సౌరభ్ వర్మ ఫైనల్‌కు చేరాడు. పురుషుల సింగిల్స్ సూపర్ 100 విభాగంలో పోటీపడిన ఈ ఆటగాడు... శనివారం జరిగిన సెమీస్‌లో మినోరు కొగా(జపాన్)ను ఓడించాడు. ఈ మ్యాచ్‌ను 22-20, 21-15 వరుస సెట్లలో గెలిచాడు సౌరభ్. ఈ మ్యాచ్ 51 నిముషాల పాటు సాగింది. ప్రస్తుతం ప్రపంచ బ్యాడ్మింటన్ ర్యాంకింగ్స్‌లో 38వ ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు సౌరభ్.
మరో సెమీస్ మ్యాచ్‌లో లిన్ యు హిన్(తైవాన్)ను 21-17, 21-16 తేడాతో ఓడించాడు సన్ ఫీ జియాంగ్(చైనా). ఆదివారం జరిగే ఫైనల్ మ్యాచ్‌లో సన్తో తలపడనున్నాడు సౌరభ్ వర్మ.
ఇదీ చూడండి: యాషెస్: డెన్లీ డాషింగ్- ఇంగ్లాండ్ భారీ స్కోర్