దేశంలోని క్రీడా పురస్కారాల కోసం సిఫార్సులు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, ఆర్చరీ, అథ్లెటిక్స్ సంఘాలు వారివారి ప్రతిపాదనలను కేంద్రానికి పంపాయి. తాజాగా భారత బ్యాడ్మింటన్ సంఘం(Badminton Association of India) కూడా అవార్డుల కోసం పేర్లను సిఫార్సు చేసింది.
ఇందులో కిదాంబి శ్రీకాంత్(Kidambi Srikanth), సాయి ప్రణీత్(Sai Praneeth) పేర్లను ఖేల్‌రత్న కోసం ప్రతిపాదించింది. అలాగే అర్జున కోసం హెచ్ఎస్ ప్రణయ్(HS Prannoy), ప్రణవ్ జెర్రీ, సమీర్ వర్మలను నామినేట్ చేసింది. ద్రోణాచార్య అవార్డు కోసం ఎస్.మురళీధరన్, పీయూ భాస్కర్‌ను, ధ్యాన్‌చంద్ పురస్కారానికి పీవీవీ లక్ష్మీ, లెరో డీ సాలను సిఫార్సు చేసింది.
2019లో ప్రపంచ ఛాంపియన్ షిప్లో ప్రణీత్ కాంస్యంతో మెరిశాడు. అలాగే టోక్యో ఒలింపిక్స్ పురుషుల సింగిల్స్ విభాగంలో పోటీపడబోతున్న ఏకైక బ్యాడ్మింటన్ ప్లేయర్‌గా నిలిచాడితడు. కాగా, 2017 నుంచి కెరీర్లో ఒడుదొడుకుల్ని ఎదుర్కొంటున్నాడు శ్రీకాంత్.