హాస్యనటులు అంటే ప్రేక్షకులకు హాస్యాన్ని పంచేవారు. ఫర్ ఏ ఛేంజ్ వారిలో ఎవరికి తెలియని అసమాన ప్రతిభలూ ఉంటూనే ఉంటాయి. సందర్భానుసారం వాటిని బయటపెడుతుంటారు. ఉదాహరణకు ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందంలో చిత్రకారుడూ ఉన్నారు. లాక్డౌన్లో ఆయన అనేక చిత్రాలను గీసి.. అందర్నీ ఆశ్చర్యపరిచారు. ఇదే విధంగా కమెడియన్స్‌లో ఎవ్వరికీ తెలియని టాలెంట్‌ను బయటపెట్టే పనిలో పడింది 'శ్రీదేవి డ్రామా కంపెనీ'(Sridevi Darma Company). ప్రతి ఆదివారం ఈటీవీలో ప్రసారమయ్యే ఈ కార్యక్రమంలో ఇద్దరు జబర్దస్త్ కమెడియన్స్ తమలోని సింగింగ్, డ్యాన్సింగ్ టాలెంట్లతో తమ టీమ్మెంబర్స్ను షాక్‌కు గురిచేశారు. వారెవరో తెలుసుకుందాం.
మిమిక్రీతో పాటలు
'చలాకి చంటి' టీమ్‌లో కమెడియన్‌గా గుర్తింపు పొంది.. ఆ తర్వాత తనదైన వినోదాన్ని పంచుతూ, ప్రస్తుతం టీమ్ లీడర్ స్థాయికి ఎదిగాడు సునామీ సుధాకర్. అప్పటివరకు తనదైన మార్క్ కామెడీతో, గాలిపటాల స్టెప్పులతో ప్రేక్షకులను అలరించిన సుధాకర్.. ఇప్పుడు తన టీమ్ మెంబర్స్‌కు తెలియని టాలెంట్‌ను బయటపెట్టాడు. ఈటీవీలో ప్రసారమవుతోన్న 'శ్రీదేవి డ్రామా కంపెనీ' కార్యక్రమంలో తనలోని సింగర్‌ను పరిచయం చేశాడు. రాజబాబు, అల్లూరి రామలింగయ్య, సిల్క్‌స్మిత, నాడా వెంకటేశ్వరరావు గొంతులతో ఆనాటి పాటలు పాడి అలరించాడు. తనలోని తెలియని టాలెంట్‌ను తెలుసుకున్న తోటి కమెడియన్స్ సుధాకర్‌ను అభినందించారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
తొలిసారి కొరియోగ్రఫీ..
'అదిరే అభి' టీమ్‌లో నటించే రాము.. తొలిసారి కొరియోగ్రాఫర్ అవతారమెత్తాడు. ఆదివారం ప్రసారమైన 'శ్రీదేవి డ్రామా కంపెనీ' కార్యక్రమంలో ఓ సాంగ్‌కు కొరియోగ్రఫీ చేసి అందర్నీ ఆశ్చర్యానికి గురిచేశాడు. 'కంత్రి' సినిమాలోని 'ఐ గో క్రేజీ' సాంగ్‌కు స్టెప్పులు సమకూర్చగా.. అందులో పండు, సత్య డ్యాన్స్ చేశారు. సునామీ సుధాకర్, రాము చేసిన ప్రదర్శనలు చూసిన తర్వాత వీరిద్దరూ మరింత ఎత్తుకు ఎదగాలని తోటి నటీనటులు అభినందించారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీ చూడండి.. 'పూరీ జగన్నాథ్ ఆఫర్‌ను అందుకే వద్దన్నా!'