ETV Bharat / sitara

'విశ్లేషించటం వల్ల దేనిపైన ఉన్న భయమైన పోతుంది' - సెలెనా గోమెజ్​ న్యూస్​

ప్రముఖ సింగర్​ సెలెనా గోమెజ్​ దీర్ఘకాలికంగా బైపోలార్​ డిజార్డర్​తో బాధ పడుతున్నట్టు తెలిపింది. డిస్నీ స్టార్​ మిలే సైరస్​ నిర్వహించే 'బ్రైట్​ మైండెడ్​​' అనే కార్యక్రమంలో తాజాగా ఈ విషయాన్ని వెల్లడించింది. దీని గురించి తెలుసుకుని మానసికంగా ధృఢంగా ఉండాలని ఆశిస్తోందీ గాయని.

Selena Gomez shares bipolar diagnosis
'విశ్లేషించటం వల్ల దానిపై ఉన్న భయం పోతుంది'
author img

By

Published : Apr 4, 2020, 4:14 PM IST

సింగర్ సెలెనా గోమెజ్.. బైపోలార్ డిజార్డర్​తో బాధ పడుతున్నట్లు తెలిపింది. తన తోటి సహచరి డిస్నీ స్టార్ మిలే సైరస్‌తో ఇన్‌స్టాగ్రామ్ లైవ్​లో ఈ విషయాన్ని వెల్లడించింది.

"నేను ఇటీవలే ప్రపంచంలోని అత్యుత్తమ మానసిక ఆసుపత్రులలో ఒకదానికి వెళ్లా. కానీ, కొన్ని సంవత్సరాల తర్వాత బైపోలార్​ డిజార్డర్​ గురించి గ్రహించాను. అందువల్ల దీని సమాచారం తెలుసుకోవటం వల్ల అది నాకు మరింత సహాయపడుతుందని భావించాను. నాకు తెలిసి అది నన్ను భయపెట్టదు. దాని గురించి తెలిసిన తర్వాత అభిమానులు భయపడతారని అనుకుంటున్నా."

- సెలెనా గోమెజ్​, గాయని

సెలెనా గోమెజ్​.. తన మానసిక ఆరోగ్యం గురించి తెలుసుకునే చర్యను ఓ చిన్ననాటి జ్ఞాపకంతో పోల్చుకుంది. "నా చిన్నతనంలో ఉరుములకు భయపడ్డాను. ఉరుములకు సంబంధిన విషయాల పుస్తకాలను కొని మా అమ్మ వాటి గురించి వివరించింది. అలాగే ఏ విషయంపై అయినా అవగాహన కల్పిస్తే మీరు భయపడరు" అని ఆమె తెలిపింది.

Selena Gomez shares bipolar diagnosis
సెలెనా గోమెజ్

డిస్నీ స్టార్​ మిలే సైరస్‌ 'బ్రైట్​ మైండెడ్​' అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ప్రముఖులతో లైవ్​ చాట్​ సెషన్​ నిర్వహించి వారిని ఇంటర్వ్యూ చేస్తుంది. శుక్రవారం జరిగిన ఈ కార్యక్రమంలో సింగర్​ సెలెన్​ గోమెజ్​ పాల్గొంది.

ఇదీ చూడండి.. 'ఐసోలేషన్​షిప్'​లో నటి ఊర్వశి అందాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.