ETV Bharat / sitara

హైదరాబాద్ వరద బాధితులకు సంపూ విరాళం - సీఎం సహాయనిధికి విరాళాలు

భాగ్యనగరంలో ఉన్న వరద బాధితుల కోసం సినీ నటుడు సంపూర్ణేశ్​ బాబు తన వంతు సహాయంగా విరాళాన్ని అందజేశారు. మంత్రి హరీశ్​రావు నివాసంలో సంపూ రూ. 50 వేల చెక్​ను అందజేశారు.

sampurnesh babu donation on hyderabad floods to cm relief fund
భాగ్యనగర వరద బాధితుల కోసం సీఎం సహాయనిధికి సంపూ విరాళం
author img

By

Published : Oct 21, 2020, 7:33 PM IST

హైదరాబాద్​లో వరద బాధితులను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి సహాయనిధికి సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖుల నుంచి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. మంగళవారం అగ్రహీరోలంతా తమ వంతు బాధ్యతగా సహాయాన్ని ప్రకటించగా ప్రముఖ నటుడు సంపూర్ణేశ్​ బాబు రూ. 50 వేలను సీఎం సహాయనిధికి అందజేశారు.

హైదరాబాద్​లోని మంత్రి హరీశ్​రావు నివాసంలో స్వయంగా చెక్​ అందజేశారు. సంపూర్ణేశ్​ బాబు చేసిన సహాయం పట్ల మంత్రి హరీశ్​రావు హర్షం వ్యక్తం చేశారు. దర్శకుడు ఎన్​. శంకర్​ కూడా ముఖ్యమంత్రి సహాయనిధికి రూ. పది లక్షలు విరాళంగా ప్రకటించారు.

ఇదీ చదవండిః వర్షాలపై ట్వీట్.. ట్విట్టర్​ నుంచి బ్రహ్మాజీ ఔట్!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.