తెలంగాణలో లాక్డౌన్ ఎత్తేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ఇన్ని రోజుల నుంచి మూతపడ్డ థియేటర్లు రేపటి నుంచి తెరుచుకునేందుకు సిద్ధమయ్యాయి. ఇన్ని రోజులు లాక్ డౌన్ నిబంధనలు పాక్షికంగా ఉండటం వల్ల సినిమా చిత్రీకరణ అంతంత మాత్రంగానే సాగింది. చిత్రీకరణ పూర్తి చేసుకున్న సినిమాలు ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నా.. అడ్డంకులు తొలగే వరకు వేచి చూశారు నిర్మాతలు.
ఆదివారం నుంచి లాక్డౌన్ నిబంధనలు ఉండబోవని సీఎం కేసీఆర్ ప్రకటించారు. దీంతో స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసుకున్న సినిమాలు సెట్స్‌పైకి వెళ్లడానికి సిద్ధమయ్యాయి. చిత్రీకరణ పూర్తి చేసుకున్న సినిమాలు ప్రేక్షకుల ముందుకు మొదట రానున్నాయో వేచి చూడాల్సి ఉంది.
ఇదీ చదవండి:pranati rai prakash.. ఈ ముద్దుగుమ్మ.. గ్లామర్ బుట్టబొమ్మ!