బాలయ్యతో కలిసి హీరో నాని 'అన్‌స్టాపబుల్' క్రికెట్ - Actor Nani 'Unstoppable with NBK' promo
'అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే' షో కొత్త ప్రోమో వచ్చేసింది. నాని సరదా సంగతులు.. బాలయ్య హుషారైన హోస్టింగ్.. ఎపిసోడ్‌పై అంచనాలు పెంచుతున్నాయి.

నందమూరి బాలకృష్ణ 'అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే' టాక్ షో రెండో ఎపిసోడ్‌కు నాని అతిథిగా విచ్చేశారు. ఆ ప్రోమోను విడుదల చేశారు. ఇందులో భాగంగా బాలయ్యతో కలిసి నాని సందడి చేశారు. ఇద్దరూ కలిసి క్రికెట్ ఆడారు.
తాను షూటింగ్‌లకు వెళ్లినప్పుడు కారులో క్రికెట్ కిట్‌ను కూడా తీసుకెళ్తానని బాలయ్య అన్నారు. 'ఈగ' సినిమాలోని 'అందరికీ పెట్టి.. నాకు పెట్టలేదంటే నేను ఎంత స్పెషల్' అంటూ నాని డైలాగ్‌ను బాలయ్య చెప్పి ఆకట్టుకున్నారు.

తన సినిమా నేరుగా ఓటీటీలో రిలీజ్ అయినప్పుడు డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్ పెట్టిన ప్రెస్‌మీట్ గురించి నాని చెప్పారు. ఈ ఎపిసోడ్ నవంబరు 12న ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.
మరోవైపు బాలకృష్ణ 'అఖండ' సినిమాతో బిజీగా ఉండగా, నాని 'శ్యామ్ సింగరాయ్' చిత్రంలో నటిస్తున్నారు. నాని సినిమా డిసెంబరు 24న థియేటర్లలోకి రానుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇవీ చదవండి: