ETV Bharat / sitara

సమీక్ష: పవన్ 'వకీల్​సాబ్ 'ఎలా ఉందంటే? - వకీల్​సాబ్ సమీక్ష

పవర్​స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా తెరకెక్కిన చిత్రం 'వకీల్​సాబ్'. వేణు శ్రీరామ్ దర్శకుడు. ఈరోజు థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఎలా ఉందో ఈటీవీ భారత్ సమీక్ష ద్వారా తెలుసుకుందాం.

Vakeelsaab
వకీల్​సాబ్
author img

By

Published : Apr 9, 2021, 12:59 PM IST

Updated : Apr 9, 2021, 2:11 PM IST

చిత్రం: వకీల్‌ సాబ్‌

నటీనటులు: పవన్‌కల్యాణ్‌, నివేదా థామస్‌, అంజలి, అనన్య, ప్రకాశ్‌రాజ్‌, శ్రుతి హాసన్‌, నరేశ్‌

సంగీతం: తమన్‌

సినిమాటోగ్రఫీ: పి.ఎస్‌.వినోద్‌

ఎడిటింగ్‌: ప్రవీణ్‌ పూడి

మూల కథ: పింక్‌(అనిరుధ్‌ రాయ్‌ చౌదరి, సూజిత్‌ సిర్కార్‌)

నిర్మాత: దిల్‌రాజ్‌

సమర్పణ: బోనీకపూర్‌

రచన, దర్శకత్వం: వేణు శ్రీరామ్‌

బ్యానర్‌: శ్రీ వేంకటేశ్వరక్రియేషన్స్‌

విడుదల: 09-04-2021

Vakeelsaab
వకీల్​సాబ్

'వకీల్ సాబ్'.. మూడేళ్ల విరామం తర్వాత పవన్ కల్యాణ్ నటించిన సినిమా. బాలీవుడ్​లో ఘన విజయాన్ని సాధించిన 'పింక్' చిత్రానికి రీమేక్​గా రూపొందిన ఈ సినిమాకు వేణుశ్రీరామ్ దర్శకత్వం వహించారు. తొలిప్రేమ చూసి పవన్​తో సినిమా చేయాలన్న నిర్మాత దిల్ రాజు ఏళ్ల తరబడి కన్న కలలతో భారీ అంచనాల మధ్య ప్రపంచ వ్యాప్తంగా ఏప్రిల్ 9న ప్రేక్షకుల ముందుకొచ్చింది. అయితే 'పింక్' సినిమా చూసిన చాలా మంది పవన్ కల్యాణ్ ఇమేజ్​కు ఆ సినిమా ఎంత వరకు సూట్ అవుతుంది? రాజకీయాలతో తీరిక లేకుండా ఉన్న పవన్ సినిమాల్లో మళ్లీ నాటి సత్తా చూపించగలడా? మహిళా సాధికారత నేపథ్యంగా నడిచే కథతో పవన్ అభిమానులను మెప్పించగలడా? అనే సందేహాలు వచ్చాయి. ఇలా ఎన్నో రకాల ప్రశ్నలు, సందేహాల నడుమ ప్రేక్షకుల ముందుకొచ్చిన 'వకీల్ సాబ్' ఎలాంటి న్యాయం చేశాడో చూద్దాం.

ఇదీ కథ..

జరీనా(అంజలి), దివ్యానాయక్(అనన్యనాగళ్ల), పల్లవి(నివేదా థామస్​). ఈ ముగ్గురు అమ్మాయిలు హైదరాబాద్ వచ్చి ఉద్యోగాలు చేస్తూ ఊళ్లల్లో ఉన్న కుటుంబాలకు అండగా ఉంటారు. ఓ రోజు జరీనా ఆఫీసులో జరిగిన పార్టీకి వెళ్లి వస్తున్న దారిలో క్యాబ్ పాడైపోతుంది. అర్థరాత్రి నడిరోడ్డుపై ఉండగా.. అటువైపుగా పల్లవి స్నేహితుడు కారులో వస్తాడు. అందులో ఎక్కిన జరీనా, దివ్య, పల్లవిలను కారులో ఉన్న ముగ్గురు మొయినాబాద్ సమీపంలోని ప్రకృతి రీసార్ట్​కు తీసుకెళ్తారు. అక్కడ జరిగిన లైంగిక దాడిలో పల్లవి ఎంపీ కొడుకు వంశీ తలపై బలంగా కొడుతుంది. తీవ్రంగా గాయపడిన వంశీ పల్లవిపై కేసు పెడతాడు. బెయిల్ రాకుండా చేస్తాడు. నిస్సహాయ స్థితిలో ఉన్న జరీనా, దివ్య, పల్లవిలు లక్ష్మీ విహార్ కాలనీకి వచ్చిన వకీల్ సాబ్ సత్యదేవ్(పవన్ కల్యాణ్)ను కలుస్తారు.

Vakeelsaab
వకీల్​సాబ్

వాళ్లకు జరిగిన అన్యాయాన్ని తెలుసుకున్న సత్యదేవ్​పై ఎంపీ కొడుకు దాడి చేయిస్తాడు. ఈ కేసు వెనుక బలమైన వ్యక్తులన్నారని తెలుసుకున్న సత్యదేవ్ పల్లవి కేసును వాదించేందుకు అంగీకరిస్తాడు. ప్రత్యర్థి వంశీ తరపున నందగోపాల్(ప్రకాశ్ రాజ్) రంగంలోకి దిగుతాడు. సత్యదేవ్, నందగోపాల్ ల వాద, ప్రతివాదనలు పోటాపోటీగా జరుగుతాయి. ఆ ముగ్గురు అమ్మాయిలే తప్పుచేశారని నందగోపాల్ నమ్మిస్తాడు. సత్యదేవ్​ను రెచ్చగొట్టి బార్ కౌన్సిల్ చర్యలు తీసుకునేలా చేస్తాడు. ఈ క్రమంలో ఆ ముగ్గురు అమ్మాయిలకు న్యాయం చేస్తానన్న వకీల్ సాబ్ ఏం చేశాడు? తన గతమేంటో తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

ఎలా ఉందంటే..

దేశంలో ఆడపిల్లలపై జరుగుతున్న లైంగిక దాడుల్లో ఎవరిది తప్పు? ఎవరిది ఒప్పు? అనే విషయాన్ని ప్రశ్నిస్తుంది 'వకీల్ సాబ్' చిత్రం. ఇలాంటి కేసుల్లో న్యాయస్థానాల్లో ఏం జరుగుతుంది? సామాన్యుల పరిస్థితి ఏంటనేది కళ్లకు కట్టినట్లు చూపించారు. మధ్యతరగతి కుటుంబాల్లోని అమ్మాయిల మాన ప్రాణాలకు ఈ సమాజంలో ఎంత గౌరవం ఉందనేది కూడా అద్దంపడుతుంది. అయితే ఈ చిత్రంలో హిందీ, తమిళంలో విడుదలైనప్పటికీ ప్రతి భాషలో విడుదల చేయాల్సిన బలమైన కథ ఇది. నిర్భయ, దిశ చట్టాలెన్ని వచ్చినా ఆడపిల్లలను చూసే విధానం మారాలని చెప్పే కథ. సమాజంలో మార్పునకు కారణమయ్యే ఇలాంటి కథను తెలుగులో రీమేక్ చేయడం అనేది దర్శకనిర్మాతలను అభినందించాల్సిందే.

బిచ్చగాడికి అన్నం దొరుకుతుంది, పనిచేసేవాడికి పనిదొరుకుతుంది! కానీ సామాన్యుడికి న్యాయం జరగడం లేదనే ఆలోచనలో నుంచి రాసుకున్న కథను ముగ్గురు అమ్మాయిలకు ముడిపెట్టి తెరకెక్కించిన విధానం బాగుంది. ప్రథమార్ధం ముగ్గురు అమ్మాయిల కుటుంబ పరిస్థితిని చూపించి నేరుగా ప్రేక్షకుడ్ని కథలోకి తీసుకెళ్లిన దర్శకుడు.. ఆ అమ్మాయిలకు జరిగిన అన్యాయాన్ని వకీల్ సాబ్ ఎలా ఎదిరించి గెలిపించాడో ద్వితీయార్ధంలో చూపించి ముగించారు. అమ్మాయిల జీవన విధానం, సామాన్యుల కోసం పోరాటం చేసే వకీల్ సాబ్ తపన, పవన్, శ్రుతిహాసన్​ల గతాన్ని ఫస్టాఫ్​లో చూపించారు. ద్వితీయార్థం మొత్తం కోర్టు డ్రామాతోనే నడుస్తుంది. ప్రకాశ్ రాజ్, పవన్ మధ్య జరిగే వాద, ప్రతివాదాలు ఆకట్టుకుంటాయి. పవన్ పలికే సంభాషణలు ప్రస్తుత పరిస్థితులను ప్రతిబింబిస్తాయి.

ఎవరెలా చేశారంటే..

ఈ కథలో కీలకంగా నిలిచే ముగ్గురు అమ్మాయిలుగా అంజలి, అనన్య, నివేదితా తమ నటనలో జీవించారు. బాధిత యువతులుగా న్యాయస్థానంలో పోరాడే విధానం బాగుంది. కోర్టు సన్నివేశాల్లో నివేదా థామస్​ చక్కగా నటించారు. ఇక పవన్ కల్యాణ్ విషయానికొస్తే మూడేళ్ల విరామం ఇచ్చినా ఏ మాత్రం ఆ మేనరిజం తగ్గలేదనే చెప్పాలి. విద్యార్థి నాయకుడిగా, న్యాయవాదిగా మెప్పిస్తూ అభిమానుల్లో నూతన ఉత్సాహాన్ని నింపారు. 'వకీల్ సాబ్' సత్యదేవ్ పాత్రకు ప్రాణం పోశారు. పెద్ద పెద్ద సన్నివేశాలు, సంభాషణలంటే వెనకడుగు వేసే పవన్.. ఈ చిత్రంలో మాత్రం దూసుకెళ్లిపోయాడనే చెప్పాలి. న్యాయస్థానంలోని సన్నివేశాలు, సంభాషణలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

"చీడ పురుగు మగవాడి మెదడులో పెట్టుకొని.. మందు ఆడవాళ్ల మోహం మీద కొడతాం. ఆశయం కోసం పనిచేసేవాడికి గెలుపు ఓటములతో పని ఉండదు, ఆవేశమే నీ ఆయుధం, ఓటమంటే అవమానం కాదు.. నిన్ను నువ్వు గెలవడం" లాంటి సంభాషణలకు చప్పట్లు కొట్టిస్తాయి.

Vakeelsaab
వకీల్​సాబ్

అలాగే పవన్​కు పోటాపోటీగా సీనియర్ న్యాయవాది పాత్రలో ప్రకాశ్ రాజ్ నటించారనే చెప్పాలి. న్యాయస్థానంలో ఎవరికి వారే సాటి అనిపించుకున్నారు. ఇక దర్శకుడిగా వేణుశ్రీరామ్ ఈ కథకు నూటికి నూరుపాళ్లు న్యాయం చేశారు. పవన్ కళ్యాణ్ ఇమేజ్​కు ఏ మాత్రం తగ్గకుండా మూల కథలో ఎంత వరకు కావాలో అంతవరకు మార్పులు చేసిన దర్శకుడు.. వాటిని తెరపై ఆవిష్కరించిన తీరు ఆకట్టుకుంటుంది. న్యాయవాది పాత్రలో పవన్​ను మలిచిన విధానం ప్రశంసనీయమని చెప్పాలి. అలాగే పవన్​కు జోడిగా శ్రుతిహాసన్​ ఫర్వాలేదనిపించింది. సంగీత పరంగా తమన్ 'వకీల్ సాబ్' మరో మెట్టు ఎక్కించాడనే చెప్పాలి. విడుదలకు ముందే తన పాటలతో శ్రోతలను ఆకట్టుకున్న తమన్​.. తెరపై కూడా చక్కటి నేపథ్య సంగీతాన్ని అందించి పవన్ అభిమాని అనిపించుకున్నారు. నిర్మాణ పరంగా దిల్ రాజు తీసుకున్న శ్రద్ద ప్రతి సన్నివేశంలో కనిపిస్తుంది.

బలాలుబలహీనత
పవన్ కల్యాణ్ నటనప్రథమార్ధంలో ఫ్లాష్​బ్యాక్​
కోర్టు సన్నివేశాలు
సంభాషణలు
పాటలు

చివరిగా: పవర్ పుల్.. 'వకీల్ సాబ్'

గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!

Last Updated : Apr 9, 2021, 2:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.