ETV Bharat / sitara

టాలీవుడ్‌ ప్రముఖులతో భేటీకానున్న ఏపీ సీఎం జగన్‌!

author img

By

Published : Aug 15, 2021, 3:00 AM IST

టాలీవుడ్​కు చెందిన అగ్ర నటులు, దర్శక-నిర్మాతలతో ఏపీ సీఎం భేటీ కానున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలో నెలకొన్న సమస్యలపై చర్చించనున్నారు.

cini actors meet cm
cini actors meet cm

తెలుగు చిత్ర పరిశ్రమలో నెలకొన్న సమస్యలపై చర్చించేందుకు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సుముఖత వ్యక్తం చేశారు. ఈ మేరకు తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన అగ్ర నటులు, దర్శక-నిర్మాతలతో సీఎం చర్చించనున్నారు. కరోనా కారణంగా చిత్ర పరిశ్రమకు వాటిల్లిన నష్టం, పునరుత్తేజం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలను సీఎం జగన్‌ దృష్టికి తీసుకురానున్నారు. చిరంజీవి, ఇతర సినీ ప్రముఖులు సీఎంను కలవనున్నారు.

ముఖ్యంగా థియేటర్లు, టికెట్‌ ధరలు సహా పలు అంశాలను ఈ సందర్భంగా చర్చించే అవకాశం ఉంది. ఆగస్టు చివరి వారంలో ఈ సమావేశం జరుగుతుందని తెలుగు చిత్ర పరిశ్రమ వర్గాలు తెలిపాయి. మరి ఈ భేటీలో ఎవరెవరు పాల్గొంటారనే విషయంపై త్వరలోనే పూర్తి వివరాలు వెలువడే అవకాశం ఉంది. గతంలోనూ సీఎం జగన్‌ తెలుగు సినీ పరిశ్రమ పెద్దలతో భేటీ అయ్యారు. ఈ విషయంలో మంత్రి పేర్ని నాని కీలకంగా వ్యవహరించారు.

ఇదీ చూడండి: బండ్ల గణేశ్ షాకింగ్​ నిర్ణయం.. త్వరలో దానికి దూరం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.