జాంబీ రెడ్డి చిత్ర బృందం ఏపీలోని విజయవాడలో సందడి చేసింది. హీరోగా తొలి సినిమా విజయం సాధించడం సంతోషంగా ఉందని కథానాయకుడు తేజ అన్నారు. కరోనా తరువాత సినిమా విడుదలైనా ఎంతగానో ఆదరించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. చిత్రాన్ని థియేటర్లో వీక్షించని వారికోసం.. 'ఆహా'లో ఈనెల 26న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు.
మొదటిసారిగా జాంబీస్ని టాలీవుడ్లో పరిచయం చేశామని చిత్ర దర్శకులు ప్రశాంత్ వర్మ తెలిపారు. ప్రమోషన్లో భాగంగా విజయవాడకు వచ్చామన్నారు. రాయలసీమ నేపథ్యంలో కామెడీ, హర్రర్ చిత్రం చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. జాంబిరెడ్డి-2 ని త్వరలో తెరకెక్కిస్తామని చెప్పారు.