ETV Bharat / sitara

కారణం లేకుండానే నన్ను నిందించారు: సునీత - సునీత వార్తలు

గత కొన్నేళ్లుగా తాను ఎంతోమంది నెగెటివ్​ కామెంట్లు ఎదుర్కొన్నానని అంటున్నారు ప్రముఖ గాయని సునీత. మహిళా దినోత్సవం పురస్కరించుకొని ఆమె ఇన్​స్టాగ్రామ్​ వేదికగా తన జీవితంలో చవిచూసిన ఇబ్బందులను ప్రతిబింబించేలా ఓ పోస్ట్​ పెట్టారు.

you blame me for no reason says sunitha
కారణం లేకుండా నన్ను నిందించారు: సునీత
author img

By

Published : Mar 8, 2021, 8:09 PM IST

కొంతమంది నుంచి తాను ఎన్నో నెగెటివ్‌ కామెంట్స్‌, ట్రోల్స్, వ్యతిరేకతను ఎదుర్కొన్నానని.. వాటన్నింటినీ పునాదిరాళ్లుగా మార్చుకుని జీవితంలో ముందుకు సాగుతున్నానని ప్రముఖ గాయని సునీత పేర్కొన్నారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆమె ఇన్‌స్టా వేదికగా సందేశం పోస్టుచేశారు. ఆమె వ్యక్తిగత జీవితంలో చవిచూసిన ఎన్నో ఇబ్బందులను ప్రతిబింబించేలా ఈ పోస్ట్‌ ఉంది.

"నా జీవితాన్ని మీరే నిర్ణయిస్తారు. ట్రోల్‌ చేస్తారు. నన్ను ప్రతిసారీ కిందకు లాగుతుంటారు. నాలో అభద్రతాభావాన్ని నెలకొల్పుతుంటారు. అలాగే, ఎప్పుడూ మీరు నన్ను నమ్మరు. నాకు అండగా నిలవరు. ఆఖరికి నేను చెప్పేది కూడా వినరు. నేను ఓడిపోయినప్పుడు నన్ను చూసి నవ్వుతుంటారు. ఇబ్బంది పెడుతుంటారు. ఎలాంటి కారణం లేకుండా నన్ను నిందించిన మీరే ఇప్పుడు నాకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు చెబుతున్నారా!?."

- సునీత, ప్రముఖ గాయని

తనపై వచ్చే వ్యతిరేకతనే పునాది రాళ్లుగా వాడుకుంటూ జీవితంలో ముందుకు సాగుతానని సునీత వెల్లడించారు. "నేను మీ శుభాకాంక్షలు స్వీకరిస్తున్నాను! ఎందుకంటే మీరు నాపై విసిరిన రాళ్లేనే పునాదులుగా మార్చుకుని నా బలాన్ని మరింత పెంచుకుని.. జీవితంలో ముందుకు సాగుతున్నాను. చిరునవ్వుతో అన్నింటినీ క్షమించాను. ప్రేమను పంచాను. ఎందుకంటే నేను ఒక స్త్రీని.. అన్నింటినీ సహించాను!! మహిళా దినోత్సవ శుభాకాంక్షలు!!!" అని సునీత పెట్టిన ఈ పోస్ట్‌ ప్రస్తుతం వైరల్‌గా మారింది.

ఇదీ చూడండి: డబ్బు కోసమే ఆ సినిమాలో నటించా: కంగన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.