బిగ్‌బాస్ ఫేమ్, నటి యషిక ఆనంద్ కారు ప్రమాదంలో(yashika anand car accident) తీవ్ర గాయాలపాలైంది. తమిళనాడులోని మహాబలిపురం ఈస్ట్ కోస్ట్ రోడ్ దగ్గర శనివారం అర్ధరాత్రి ఒంటి గంటకు ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఆమె స్నేహితురాలు వల్లిచెట్టి భవాని అక్కడికక్కడే మరణించగా.. మిగతా స్నేహితులు గాయపడ్డారు. తక్షణమే పోలీసులు అక్కడికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మద్యం మత్తులో వాహనం డ్రైవ్ చేశారా అనే కోణంలోనూ విచారణ జరుపుతున్నారు.

యషిక ఆనంద్ ప్రముఖ మోడల్. తమిళ బిగ్‌బాస్‌తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. 'కవలాయ్ వెండమ్', 'నోటా', 'ధురువంగల్ పథినారు' వంటి సినిమాల్లో నటించింది. ప్రస్తుతం పలు ప్రాజెక్టులు చేస్తూ బిజీగా ఉందీ భామ.

ఇదీ చూడండి: ఆకట్టుకునే అందం 'యాషిక' సొంతం