'మీటూ' ఉద్యమం వల్ల సినీరంగంలో మార్పు కనిపిస్తోందని అభిప్రాయపడింది బాలీవుడ్ నటి కాజోల్. ఇది వరకు చిత్రపరిశ్రమలో మహిళల పట్ల వ్యతిరేక ధోరణి ఉండేదని.. దానికి అడ్డుకట్ట పడిందని వ్యాఖ్యానించింది. ఈ ఉద్యమం రాకముందు సినీ రంగంలో మహిళలకు గౌరవ మర్యాదలు అంతగా లభించేవి కాదని చెప్పిందీ బాలీవుడ్ నటి.
" సినీ రంగంలో మహిళలకు ఇచ్చే గౌరవ మార్యాదల్లో వ్యత్యాసం ఉన్న మాట వాస్తవం. ఇది కేవలం ఈ రంగంలోనే కాదు. ఏ రంగంలో అయినా మహిళల్ని ఇలానే పరిగణిస్తారు. మీటూ ఉద్యమం తర్వాత పురుషుల్లో మార్పు వచ్చింది. అది స్పష్టంగా కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ మార్పు చాలా అవసరం".
-- కాజోల్, బాలీవుడ్ నటి
హాలీవుడ్లో ప్రారంభమై..
2018లో హాలీవుడ్లో ప్రారంభమైన 'మీటూ' ఉద్యమం.. తర్వాత పలు దేశాల్లో విస్తరించింది. హాస్యనటులు, జర్నలిస్టులు, రచయితలు, నటులు, నిర్మాతలుగా ఉన్న ఎందరో మహిళలు.. వారు ఎదుర్కొంటున్న లైంగిక దాడులపై బహిరంగంగా మాట్లాడారు. అంతేేకాకుండా మానసికంగా, శారీరకంగా హింసించిన పలు ప్రముఖుల పేర్లనూ భయపెట్టారు కొందరు కథానాయికలు.
ఇటీవల కాజోల్.. 'దేవి' అనే లఘు చిత్రంలో నటించింది. తొమ్మిది మంది మహిళలు వారికి ఎదురయ్యే సమస్యలను ఎలా అధిగమించారో ఈ కథాంశం ద్వారా వివరించారు. ఇందులో శ్రుతిహాసన్, నేహా ధూపియా, నీనా కుల్కర్ణి, ముక్తా బర్వ్, శివాని రఘువంశి, సంధ్య మాత్రే, రమా జోషి, రాసస్విని దయామా నటించారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీ చదవండి: మనసా.. మనసారా బ్రతిమాలా తన వలలో పడబోకే!