బంధుప్రీతితో సంబంధం లేకుండా చిత్రపరిశ్రమలో అడుగుపెట్టి పెద్ద స్టార్‌గా ఎదిగిన నటి.. ప్రియాంకా చోప్రా. అయితే సినీ పరిశ్రమకు వచ్చిన కొత్తలో ఎన్నో అవరోధాలను ఎదుర్కొని.. నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నట్లు వివరించింది. బాలీవుడ్లో ఎవరి దారి వారిదని.. తమ కష్టాన్ని నమ్ముకుని ముందుకు సాగాలని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
"బంధుప్రీతి బాలీవుడ్‌ను శాసిస్తుందనే వాస్తవాన్ని అంగీకరిస్తున్నారా?" అని ఓ ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చింది ప్రియాంకా చోప్రా.
"వారసత్వం ఉన్న కుటుంబంలో జన్మించడంలో తప్పు లేదు. బయటివారికి సినీపరిశ్రమలో రావడానికి సులభమైన పనికాదు. అదే విధంగా కొంతమందికి కుటుంబ వారసత్వాన్ని నిలబెట్టాలనే ఒత్తిడి ఉంటుంది. ప్రతి నటీనటులకు వారి వ్యక్తిగత ప్రయాణం ఉంటుంది. పరిశ్రమకు వచ్చిన కొత్తలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నా. ఓ నిర్మాత సిఫారుసు చేసిన సినిమాలో నుంచి నన్ను తీసేశారు. అనేక సినిమాల నుంచి తప్పించారు. అప్పుడు చాలా ఏడ్చాను. కానీ, ఆ తర్వాత సమస్యలన్నింటినీ అధిగమించాను. బాలీవుడ్, బంధుప్రీతి ఎప్పుడూ జోడిగా ఉంటాయి. అయితే కొన్నేళ్లుగా ప్రతిభావంతులైన నటులు వస్తున్నారు. తమకంటూ ఓ పేరును సంపాదించుకోగలుగుతున్నారు. ఇది చాలా కష్టమైంది. చిత్ర నిర్మాణంలో చేరినప్పుడు అందరితో స్నేహంగా ఉండటం సహా పార్టీలకు వెళ్లడం కొంచెం కష్టంగా అనిపించింది. కానీ, నేను చేసే పనికి గుర్తింపు రావాలని చాలా కష్టపడ్డాను. చివరికి నాలో నటనను నిరూపించుకున్నాను."
- ప్రియాంక చోప్రా, బాలీవుడ్ నటి
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
బాలీవుడ్ హీరో సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య తర్వాత బాలీవుడ్లో బంధుప్రీతి గురించి సోషల్‌మీడియాలో చర్చ ఊపందుకుంది. బంధుప్రీతిని ప్రోత్సహిస్తూ బయటి వ్యక్తులు చిత్రపరిశ్రమలోకి రాకుండా కొంతమంది ప్రముఖులు అడ్డుకుంటున్నారని నెటిజన్లు ఆరోపిస్తున్నారు.