ETV Bharat / sitara

'ఫుడ్​, బెడ్​ బాగుందని పక్కింటికి వెళతావా..?' - విశ్వక్​ సినిమా టీజర్​

'విశ్వక్​' సినిమా టీజర్​ను శుక్రవారం యువకథానాయకుడు విశ్వక్​సేన్​ సామాజిక మాధ్యమాల వేదికగా విడుదల చేశాడు. అజయ్​ కతుర్వాల్​, డింపుల్​ హీరోహీరోయిన్లుగా నటిస్తుండగా.. వేణు ముల్కల దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ టీజర్​లోని సంభాషణలు ఆకట్టుకునేలా ఉన్నాయి.

Vishwak film official teaser released by hero Vishwak Sen
'ఫుడ్​, బెడ్​ బాగుందని పక్కింటికి వెళతావా..?'
author img

By

Published : Apr 4, 2020, 10:40 AM IST

యువ కథానాయకుడు విశ్వక్‌సేన్‌ 'విశ్వక్‌' సినిమా టీజర్‌ను విడుదల చేశాడు. అజయ్‌ కతుర్వార్‌, డింపుల్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ఇది. వేణు ముల్కల దర్శకత్వం వహిస్తున్నాడు. గోల్డెన్‌ డక్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై తాటికొండ ఆనందం బాలకృష్ణన్‌ నిర్మిస్తున్నాడు. విభిన్న కథాంశంతో ఈ సినిమాను రూపొందిస్తున్నట్లు ప్రచార చిత్రాన్ని బట్టి తెలుస్తోంది.

Vishwak film official teaser released by hero Vishwak Sen
'విశ్వక్​' సినిమా పోస్టర్​

"ఎన్నారైలకేమో బాధ్యత తెలియదు. ఇక్కడున్న వారికేమో నిర్లక్ష్యం.. మరి నువ్వేం.." అని హీరో ఓ వ్యక్తి చెంప పగలగొట్టి మరీ ప్రశ్నిస్తూ కనిపించాడు. ఓ యువకుడు రైతులపై ఆసక్తికర కథనం రాస్తున్నానని చెబితే.. అలా కాకుండా యువత ఒత్తిడిపై కథనం రాయమని ఓ యువతి ప్రోత్సహించడం ఆసక్తికరంగా అనిపించింది. "ఫుడ్‌, బెడ్‌ బాగుందని పక్కింటికి వెళ్లి బతుకుతావా?, బెటర్‌ లైఫ్‌ ఉందని పక్కదేశానికి వెళ్తావా?.." అంటూ కథానాయకుడు పలికిన సంభాషణలు ఆకట్టుకుంటున్నాయి.

ఇదీ చూడండి.. 'కలరాను కాల్చేశాం.. మశూచిని మసి చేశాం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.