2014లో బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్‌ఖాన్ నటించిన 'పీకే' సినిమా ఏ రేంజ్లో విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ చిత్రం ప్రతి సినీప్రేక్షకుడిని ఎంతగానో ఆకట్టుకుంది. అయితే ఈ సినిమాకు సీక్వెల్ వస్తుందని అప్పట్లో అందరూ భావించారు. ఎందుకంటే క్లైమాక్స్‌లో తన గ్రహానికి తిరిగి వెళ్లిపోయిన ఆమిర్.. రణ్‌బీర్ కపూర్‌తో కలిసి మళ్లీ భూమి మీదకు వస్తాడు. అంతటితో సినిమా ముగుస్తుంది. కానీ ఇప్పటి వరకు ఈ సినిమా కొనసాగింపు గురించి ఎటువంటి అప్డేట్ రాలేదు.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ చిత్ర నిర్మాత విధు వినోద్ చోప్రా.. ఈ విషయమై స్పందించారు. తప్పకుండా 'పీకే' సీక్వెల్ ఉంటుందని స్పష్టతనిచ్చారు. "ఈ సినిమాకు కొనసాగింపు కచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే మేము సినిమాను అలానే ముగించాం. అయితే ఈ సీక్వెల్ ఎప్పుడు వస్తుందనేది చెప్పలేను. కథ సిద్ధమయితే చిత్రాన్ని రూపొందిస్తాం. అయితే ఈ కథ రచయిత ఇంకా స్క్పిప్టును రాయలేదు. అతడు ఎప్పుడు కథ రాయడం ముగిస్తే ఆ రోజు చిత్రాన్ని తెరకెక్కిస్తాం." అని అన్నారు. దర్శకుడు రాజ్‌కుమార్ హిరానీ కూడా ఈ సినిమాకు సీక్వెల్ పక్కాగా ఉంటుందని చెప్పారు. ఇందులో రణ్‌బీర్ కపూర్ ప్రధాన పాత్ర పోషించే అవకాశముంది.
ఇదీ చూడండి: ఒక్క సినిమా కోసం 10 వేల కిళ్లీలు తిన్న ఆమిర్