ETV Bharat / sitara

'క్రాక్‌' కోసం విక్టరీ వెంకటేష్‌! - రవితేజ చిత్రానికి వెంకీ వాయిస్

రవితేజ కథానాయకుడిగా తెరకెక్కనున్న క్రాక్​ సినిమాలో సందడి చేయనున్నారు అగ్ర హీరో విక్టరీ వెంకటేష్. కానీ, ఈయన తెరమీద కనిపించరని చిత్ర బృందం పేర్కొంది.

Victory Venatesh in Crack movie
'క్రాక్‌' కోసం వెంకటేష్‌!
author img

By

Published : Jan 1, 2021, 8:15 AM IST

రవితేజ నటిస్తున్న 'క్రాక్‌' చిత్రంలో అగ్ర హీరో వెంకటేష్‌ సందడి కనిపించబోతుంది. అలాగని ఆయనేం తెరపై కనిపించరు.. తెర వెనుక నుంచి కథ నడిపిస్తారు. ఈ విషయాన్ని చిత్ర బృందం గురువారం ప్రకటించింది.

గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రమిది. బి.మధు నిర్మాత. శ్రుతిహాసన్‌ కథానాయిక. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. నిర్మాణాంతర పనులు తుది దశకు చేరుకున్నాయి. ఇప్పుడీ చిత్రం కోసం వెంకటేష్‌తో వాయిస్‌ ఓవర్‌ చెప్పిస్తోంది చిత్ర బృందం.

"తెలుగు రాష్ట్రాల్లో జరిగిన యదార్థ ఘటనల ఆధారంగా రూపొందిన చిత్రమిది. రవితేజ, గోపీచంద్‌ మలినేని కలయికలో వస్తున్న మూడో చిత్రం. ఈ చిత్రానికి వెంకటేష్‌ వాయిస్‌ ఓవర్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. కొత్త ఏడాది కానుకగా శుక్రవారం చిత్ర ట్రైలర్‌ విడుదల చేస్తున్నాం" అని చిత్ర దర్శకనిర్మాతలు అన్నారు. ఈ చిత్రానికి సంగీతం ఎస్‌.తమన్‌ అందించారు.

ఇదీ చదవండి:ఉషోదయాన.. తారల ఆశోదయం!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.