పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం 'వకీల్‌సాబ్'. బాలీవుడ్ చిత్రం 'పింక్'కు రీమేక్‌గా ఈ సినిమా రూపొందుతోంది. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలోని తన పాత్ర షూటింగ్‌ను ఇటీవలే పూర్తి చేశారు పవన్. తాజాగా ఈ సినిమా టీజర్ తేదీని వెల్లడించింది చిత్రబృందం. సంక్రాంతి కానుకగా జనవరి 14న సాయంత్ర 6.03 గంటలకు టీజర్‌ను విడుదల చేస్తామని ప్రకటించింది.

నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా తెరకెక్కిన చిత్రం 'లవ్‌స్టోరి'. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ ప్రేమకథా చిత్ర టీజర్ తేదీని తాజాగా వెల్లడించింది చిత్రబృందం. జనవరి 10న 10.08 గంటలకు ప్రచార చిత్రాన్ని విడుదల చేస్తామని ప్రకటించింది.
