మెగాహీరో వైష్ణవ్‌తేజ్.. తొలి సినిమా 'ఉప్పెన'తో అదిరిపోయే రికార్డు సొంతం చేసుకున్నారు. తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా రూ.10 కోట్లకు పైగా వసూళ్లు సాధించిందని నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ వెల్లడించింది. టాలీవుడ్లో ఓ మీడియం బడ్జెట్ చిత్రానికి తొలిరోజు ఈ స్థాయిలో వసూళ్లు రావడం బహుశా ఇదే తొలిసారి కావొచ్చు!
ఈ సినిమాతో వైష్ణవే, కృతిశెట్టి అరంగేట్రం చేశారు. విజయ్ సేతుపతి ప్రతినాయకుడిగా నటించారు. బుచ్చిబాబు దర్శకుడిగా పరిచయమయ్యారు.
ఇది చదవండి: 'ఉప్పెన' రివ్యూ: ప్రేమకథకు సరికొత్త ముగింపు!