మెగా హీరో వైష్ణవ్ తేజ్, కృతిశెట్టి జంటగా తెరకెక్కిన చిత్రం 'ఉప్పెన'. బుచ్చిబాబు సానా దర్శకుడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమా ఫిబ్రవరిలో విడుదలై మంచి విజయం అందుకుంది. బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించింది. ఇటీవలే టీవీలో ప్రసారమైన ఈ మూవీ అక్కడా జోరు చూపించింది. టెలికాస్ట్ అయిన మొదటిసారి 18.5 టీఆర్పీతో రికార్డు సృష్టించింది. డెబ్యూ హీరో సినిమాకు ఇంతటి వ్యూస్ దక్కడం ఇదే తొలిసారి. ఇదేరోజు ప్రసారమైన విజయ్ 'మాస్టర్' చిత్రం 4.8 టీఆర్పీ దక్కించుకుంది.
-
UPPENA TV PREMIERE delivers phenomenal 18.5 ratings 💥💥#PanjaVaisshnavTej @IamKrithiShetty @VijaySethuOffl @BuchiBabuSana @ThisIsDSP @aryasukku @SukumarWritings @MythriOfficial#Uppena pic.twitter.com/tqqdx451Hm
— OverSeasRights.Com (@Overseasrights) April 29, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">UPPENA TV PREMIERE delivers phenomenal 18.5 ratings 💥💥#PanjaVaisshnavTej @IamKrithiShetty @VijaySethuOffl @BuchiBabuSana @ThisIsDSP @aryasukku @SukumarWritings @MythriOfficial#Uppena pic.twitter.com/tqqdx451Hm
— OverSeasRights.Com (@Overseasrights) April 29, 2021UPPENA TV PREMIERE delivers phenomenal 18.5 ratings 💥💥#PanjaVaisshnavTej @IamKrithiShetty @VijaySethuOffl @BuchiBabuSana @ThisIsDSP @aryasukku @SukumarWritings @MythriOfficial#Uppena pic.twitter.com/tqqdx451Hm
— OverSeasRights.Com (@Overseasrights) April 29, 2021
'ఉప్పెన' చిత్రానికి దేవీశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం పెద్ద ప్లస్. అలాగే విజయ్ సేతుపతి హీరోయిన్ తండ్రి పాత్రలో నటించి మెప్పించారు. అరంగేట్రం సినిమాతోనే వైష్ణవ్, కృతిశెట్టి వారి నటనతో విమర్శకుల ప్రశంసలూ అందుకున్నారు.