ETV Bharat / sitara

ఆ సినిమాలో వర్షం సీన్ల కోసం ఆరేళ్లు షూటింగ్​! - tumbaad shoot news

2018లో విడుదలైన బాలీవుడ్​ హారర్​ డ్రామా చిత్రం 'తుంబాడ్'​ ప్రస్తుతం నెట్టింట ట్రెండింగ్​గా నిలిచింది. ఈ సినిమాను 6 ఏళ్లు చిత్రీకరించినట్లు ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది అమెజాన్​ ప్రైమ్​ సంస్థ. ఈ నేపథ్యంలో 'తుంబాడ్'​, 'అంధాధున్'​ చిత్రాల్లో ఏది ఉత్తమ సినిమా అంటూ చర్చ మొదలైంది.

tumbaad
తుంబాడ్ సినిమా
author img

By

Published : Jun 9, 2020, 4:09 PM IST

బాలీవుడ్​ చిత్రం 'తుంబాడ్'​ గతేడాది ఫిల్మ్​ఫేర్​లో దాదాపు మూడు విభాగాల్లో అవార్డులు అందుకుంది. ఈ సినిమా గురించి తాజాగా ఓ ఆసక్తికర విషయం పంచుకుంది అమెజాన్​ ప్రైమ్​. ఈ చిత్రాన్ని తీయడానికి దాదాపు 6 సంవత్సరాలు పట్టినట్లు చెప్పింది.

సినిమాలో తుంబాడ్​ పట్టణంలో నిరంతరం వర్షం కురుస్తూనే ఉంటుంది. అలా వర్షం సీన్లు రియల్​గా ఉండాలని.. దాదాపు 4 వర్షాకాలాల్లో సినిమా చిత్రీకరించారట.

ఈ సినిమా 64వ ఫిల్మ్​ఫేర్​లో ఉత్తమ సౌండ్‌ డిజైన్‌ (కునాల్‌ శర్మ), ఉత్తమ సినిమాటోగ్రఫీ (పంకజ్‌ కుమార్), ఉత్తమ ప్రొడక్షన్‌ డిజైన్‌ (నితిన్ జిహానీ చౌదరి, రాజేష్‌ యాదవ్‌) విభాగాల్లో అవార్డులు దక్కించుకుంది.

అదే సమయంలో ఉత్తమ చిత్రంగా రాజీ, ఉత్తమ చిత్రంగా(క్రిటిక్‌) అంధాధున్‌ ఎంపికయ్యాయి. అయితే తుంబాడ్​, అంధాధున్​ చిత్రాలు ఆస్కార్​ రేంజ్​ అని... రెండింటిలో అగ్రనటీనటులు లేకపోయినా.. పురస్కారాలు, విమర్శకుల మన్ననలు పొందడమే ఇందుకు నిదర్శనమని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.

ఇదీ చూడండి:షార్క్​తో స్విమ్మింగ్​ చేసిన కత్రినా కైఫ్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.