ETV Bharat / sitara

ప్రమోషన్స్​లో నయా ట్రెండ్​.. హోస్ట్​గా మారుతున్న డైరెక్టర్లు! - ప్రభాస్​ రొమాంటిక్​ ఇంటర్వ్యూ

Directors As anchors: సినిమా ప్రమోషన్స్​లో భాగంగా జరిగే చిట్​చాట్​ షోలలో ఓ కొత్త ట్రెండ్​ మొదలైంది. ఇప్పటివరకు 'స్టార్ట్..​ యాక్షన్..​ కెమెరా' అన్న దర్శకులు.. చిట్​చాట్​ షోలలో యాంకర్లు లేదా హోస్ట్​గా అవతారమెత్తి ఇంటర్వ్యూలు చేస్తున్నారు. తమదైన స్టైల్​లో మాటల పదునుతో షో, సినిమాలకు మరింత క్రేజ్​ తెప్పిస్తున్నారు. ఇవి అభిమానులను విశేషంగా అలరిస్తున్నాయి. ఇంతకీ యాంకర్లుగా మారిన ఆ దర్శకులెవరో చూద్దాం...

Directors as Anchors
యాంకర్లుగా మారిన డైరెక్టర్స్​
author img

By

Published : Mar 17, 2022, 7:07 PM IST

Directors As anchors: ఆన్​ ది స్క్రీన్​ హీరో శాసిస్తే.. బిహైండ్​ ది స్క్రీన్​ డైరెక్టర్​ డిక్టేట్​ చేస్తాడు. ఇది సినిమాలు మొదలైనప్పటి నుంచి ఉన్న ఫార్ములా. కానీ ఇప్పుడు ట్రెండ్​ మారుతోంది. ఎప్పుడు తెర వెనుక కూర్చొని, హీరోహీరోయిన్లకు, నటీనటులకు.. స్టార్ట్​,​ కెమెరా, యాక్షన్​ అంటూ డైరెక్ట్​ చేసే కెప్టెన్లు ఇప్పుడు ఆన్ ది స్క్రీన్​ కూడా అదరగొడుతున్నారు. అభిమానులను తెగ అలరిస్తున్నారు. అయితే వారు నటులుగా మారడం చూశాం కానీ యాంకర్లుగా మాత్రం చూడలేదు. దర్శకులు చాలా పొదుపుగా మాట్లాడుతుంటారని ఎప్పటి నుంచో ఓ నానుడి కూడా ఉంది. కానీ ఇప్పుడు వారు దాన్ని చెరిపేస్తున్నారు. ప్రేక్షకులను డైరెక్ట్​గా నవ్వించేందుకు సిద్ధమైపోతున్నారు. ప్లాట్​ఫామ్​ ఏదైనా చురుగ్గా ఉంటూ తమ వాక్చాతుర్యంతో ప్రేక్షకుల్ని మంత్ర ముగ్ధులను చేస్తున్నారు. సరదాగా సెట్టైర్లు, పంచ్​లు వేస్తూ కడుపుబ్బా నవ్విస్తున్నారు.

చాలా కాలంగా.. ఓ సినిమా ప్రమోషన్ కోసం ఇతర చిత్రాల హీరో హీరోయిన్లు, దర్శకులు, నిర్మాతలు చీఫ్ గెస్ట్​గా వచ్చే ఆనవాయితీ ఉంది. కానీ కరోనా తర్వాత ఈ ట్రెడిషన్​ చాలా ఎక్కువైందనే చెప్పాలి. మరోవైపు తెలుగు సినిమాల పరిధి కూడా పెరుగుతోంది. దీంతో ఒకరి చిత్రాల పబ్లిసిటీ కోసం మరొకరు రంగంలోకి దిగుతున్నారు. చిన్న సినిమాలను స్టార్స్​ ప్రమోట్​ చేయడం, ఓ బడా హీరో సినిమాకు మరో ప్రముఖ కథానాయకుడు ప్రమోషన్​ చేయడం వంటివి జరుగుతున్నాయి.

ఓ చిత్రానికి సంబంధించిన పోస్టర్​ను మరో సినీప్రముఖుడు రిలీజ్​ చేయడం, ట్రైలర్​ను మరొకరు, ప్రీ రిలీజ్​ ఈవెంట్​కు చీఫ్​ గెస్ట్​గా​ ఇంకొకరు రావడం.. ఇలా ఒక్క మూవీకే పలువురు సెలబ్రిటీలు ప్రచారం చేస్తున్నారు. సినిమాను ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లేందుకు తమ వంతు బాధ్యతగా ప్రయత్నిస్తున్నారు. సాధారణంగా ఇప్పటివరకు ఓ మూవీ రిలీజ్​కు ముందు.. చిట్​చాట్​ పేరుతో చిత్రబృందం ఇంటర్వ్యూలో పాల్గొని సినిమాకు సంబంధించి పలు విశేషాలను పంచుకోవడం సహజమే. అయితే ఈ చిట్​చాట్​ షోలో మరో కొత్త ట్రెండ్​ వచ్చింది. అదే ఓ డైరెక్టర్ యాంకర్ లేదా హోస్ట్​గా కొత్త అవతారం​ ఎత్తడం. సగటు ప్రేక్షకుడికి ఓ సినిమాపై మరింత ఆసక్తి పెరగడానికి ఇది ఓ కారణం అని చెప్పొచ్చు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

Rajamouli interview Radheyshyam: ఇటీవలే ప్రపంచవ్యాప్తంగా దాదాపు 7వేలకు పైగా స్క్రీన్లలో విడుదలైన ప్రభాస్​ 'రాధేశ్యామ్​' కోసం దర్శకధీరుడు రాజమౌళి యాంకర్​గా మారారు. ప్రభాస్​తో కలిసి సినిమా విశేషాల గురించి ముచ్చటించారు. ఈ క్రమంలోనే పంచ్​లు వేస్తూ, కామెడీ చేస్తూ అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని నింపారు. తాజాగా ఇప్పుడు 'ఆర్​ఆర్​ఆర్'​ కోసం డెరెక్టర్​ అనిల్​రావిపూడి ఇదే చేశారు. ఎన్టీఆర్​, రామ్​చరణ్​, రాజమౌళితో కలిసి 'ఆర్​ఆర్​ఆర్​ విత్​ ఆర్'​ అనే చిట్​చాట్​ షోను చేశారు. ఇది ఫ్యాన్స్​ను విపరీతంగా ఆకట్టుకుంది. అయితే ఇది అనిల్​ రావిపూడికి కొత్తేమి కాదు. గతంలోనూ ఆయన సాయితేజ్​ సినిమా 'సోలో బ్రతుకే సో బెటర్​' మూవీ టీమ్​ను ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేసి నవ్వులు పూయించారు. వారిని ఆసక్తికరమైన ప్రశ్నలను అడుగుతూ షోలో సందడి చేశారు. ఆ షోలన్నీ కూడా సోషల్​మీడియాలో మంచి వ్యూస్​ను కూడా దక్కించుకున్నాయి.

గతంలోనూ దర్శకులు రాజమౌళి, సుకుమార్​లు కుడా ఒకరినొకరు ఇంటర్వ్యూలు చేసుకుని.. తమకు సంబంధించిన ఎన్నో ఆసక్తికరమైన విషయాలు, కబుర్లన్నింటినీ సినీప్రియులకు తెలియజేశారు. కొంత కాలం క్రితం ప్రభాస్ కూడా పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరి 'రొమాంటిక్' విడుదల సమయంలో యాంకర్​గా అవతారమెత్తి హీరో హీరోయిన్లను ఇంటర్వ్యూ చేసి తనలోని కామెడీ టైమింగ్​ను బయటకు తీశారు. దర్శకుడు తరుణ్​ భాస్కర్​ కూడా ఈటీవీలో 'నీకు మాత్రమే చెప్తా' అంటూ పలువురు సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేసి వారి అనుభవాలను అడిగి తెలుసుకున్నారు.

ఏదేమైనప్పటికీ చిత్రసీమలో ఇలా ప్రతిఒక్కరూ ఒకరి చిత్రాలకు మరొకరు పబ్లిసిటీ చేస్తూ ప్రేక్షకులకు మరింత దగ్గరవుతున్నారు. భవిష్యత్తులో ఈ తరహా వినూత్నమైన ప్రమోషన్స్​ మరింత ముందుకు వెళ్లే అవకాశం ఉంది. మిగతా దర్శకులు కూడా ఇలాంటి షోల్లో పాల్గొనేందుకు ఆసక్తి చూపొచ్చు. మొత్తంగా ఇది చాలా ఆహ్వానించదగ్గ పరిణామమనే చెప్పాలి.

ఇదీ చూడండి: మా మధ్య బలమైన స్నేహం అలా ఏర్పడింది: తారక్-చెర్రీ​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.