మాస్ మహారాజ్ రవితేజ హీరోగా మరో చిత్రాన్ని రూపొందించేందుకు రంగం సిద్ధమైంది. ఆయన నటిస్తున్న 68వ చిత్రానికి సంబంధించిన అప్డేట్ను గురువారం ఉదయం 10.08 గంటలకు విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఇందులో రవితేజ సరసన దివ్యాంశ్ కౌశిక్ హీరోయిన్గా ఎంపికైంది. ఈ సినిమా ద్వారా శరత్ అనే కొత్త దర్శకుడు టాలీవుడ్‌కు పరిచయం కానున్నాడు.

పవర్‌స్టార్ కొత్త చిత్రం
'కేజీఎఫ్' చిత్రంతో బ్లాక్బాస్టర్ను ఖాతాలో వేసుకున్న హోంబళే నిర్మాణసంస్థ.. ఇప్పుడు ప్రభాస్‌తో 'సలార్' సినిమాను తెరకెక్కిస్తోంది. అయితే ఈ బ్యానర్లో మరో కొత్త చిత్రం రూపొందనుంది. కన్నడ పవర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్ హీరోగా పవన్ కుమార్ దర్శకత్వంలో ఓ సినిమా షూటింగ్ జరుపుకొంటోంది. దీనికి సంబంధించిన టైటిల్‌ను జులై 1 తేదీన ఉదయం 11.46 గంటలకు విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.

ఆరు చిత్రాల్లో అవికా..
సినిమా అవకాశాల విషయంలో జోరు చూపిస్తోంది యువ నాయిక అవికా గోర్. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఆరు చిత్రాలతో ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమైంది. బుధవారం ఆమె పుట్టిన రోజు సందర్భంగా ఆయా చిత్ర బృందాలు అవికాకు శుభాకాంక్షలు తెలియజేస్తూ కొత్త పోస్టర్లను విడుదల చేశాయి. వాటిని సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకుంది అవికా. ఆ వివరాలవీ..
ఆది సాయి కుమార్ సరసన ఆమె నటిస్తోన్న 'అమరన్' చిత్రం ఏప్రిల్‌లో లాంఛనంగా ప్రారంభమైంది. బలవీర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. మరోవైపు యువ నటులు నవీన్ చంద్ర, కల్యాణ్ దేవ్, వెన్నెల రామారావులతో సందడి చేయనుంది. హేమంత్ దర్శకత్వం వహిస్తోన్న ఓ చిత్రంలో సవాలు విసిరే పాత్ర పోషిస్తున్నట్టు తెలిపింది. స్వీయ నిర్మాణంలో 'పాప్‌కార్న్' అనే చిత్రాన్ని ప్రకటించింది.




ఇదీ చూడండి.. భర్త అంత్యక్రియలు నిర్వహించిన బాలీవుడ్ నటి