ఘుమఘుమలాడే నాటు కోడికూర ఉన్నా వారు పట్టించుకోరు. వేడివేడి మటన్ ఖీమా వండిపెట్టినా వారు సంతోషించరు. అదే నాలుగు పండ్లు ఇవ్వండి ఇష్టంగా తినేస్తారు. ఓ రెండు ఆకుకూరలు, కూరగాయలు ఫ్రై చేసి పెట్టండి.. లొట్టలేసుకుంటూ లాగించేస్తారు. ఇంతకీ వారెవరూ అనేగా మీ సందేహం. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు శాకాహారులైపోయిన చాలా మంది హీరోయిన్ల కథే ఇది. అసలెందుకు అలా మారిపోయారో.. వారి ఆహార అభిరుచులేంటి.
దక్షిణాది వంటకాలతో..
కంగనా రనౌత్ 2013 వరకు మాంసాహారం, శాకాహారం అనే తేడా లేకుండా అన్నింటినీ ఇష్టంగా తినేది. కొన్నిరోజులకు పాల పదార్థాలు, మాసాహారం తనలో ఎసిడిటీ సమస్యను పెంచుతున్నాయని గ్రహించింది. అప్పటి నుంచి వాటికి దూరంగా ఉంటోంది.
"దక్షిణాది వంటకాలను ఎక్కువగా కూరగాయలతో చేస్తుంటారు. అందుకే వాటిని చేయడం నేర్చుకున్నా. కొబ్బరి పాలతో ఎన్నో ఆహార పదార్థాలు చేస్తుంటారు. అవి నన్ను ప్రశంతంగా ఉంచుతాయి" అని వివరించింది.
ముందు నుంచే..
ప్రణీత ముందు నుంచే శాకాహారి. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ కొన్ని రోజుల పాటు వేగన్‌గా మారాలనుకుంటోంది. ఈ విషయాన్ని ఆమె ఇన్‌స్టా ద్వారా వెల్లడించింది. శరీరానికి కావాల్సిన మాంసకృత్తుల కోసం వేగన్ ప్రొటీన్ ఫుడ్ సప్లిమెంట్‌ను ఇప్పటికే తీసుకుంటున్నట్లు తెలిపింది.
మాంసాహారం ఇష్టం ఉన్నా..
రష్మికకు హైదరాబాద్ చికెన్ బిర్యానీ అంటే చాలా ఇష్టం. కానీ ఎనిమిది నెలల నుంచి ఆమె తన అభిరుచిని మార్చుకుంది. మాంసాహానికి చాలా దూరంగా ఉంటోంది. "నేను పూర్తిగా శాకాహారిగా మారిపోయా. నాకు మాంసాహారం అంటే ఇష్టమైనా సరే.. దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నా" అని చెబుతోంది. తన శరీరాకృతిని కాపాడటం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
రెస్టారెంట్ పెట్టేసింది
జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఎప్పటినుంచో మాంసాహారం, పాల పదార్థాలకు దూరంగా ఉంటోంది. సేంద్రీయ ఆహారాన్నే ఇష్టంగా ఆరగిస్తుంది. అంతే కాదు వేగన్ ఆహార ప్రియుల కోసం ముంబయిలో ప్రత్యేకంగా ఓ రెస్టారెంట్‌నే ప్రారంభించింది. "వేగన్ ఆహారం నన్నెంతో ఆనందంగా ఉంచుతోంది. ఈ జీవన విధానాన్ని అందరికీ పరిచయం చేయాలనుకుంటున్నా. ఇలా చేస్తే మూగజీవాలకు ఎంతో మేలు జరుగుతుందని" భావిస్తున్నట్లు తెలిపిందీ భామ.