వర్షాకాలం మొదలైంది. ప్రపంచకప్ తుదిదశకు చేరుకుంది. ఇదే అదనుగా ఇక సినిమాల విడుదల జోరందుకుంది. ఈ రోజు మూడు తెలుగు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. మరి మూడింట్లో ఏ చిత్రం బాక్సాఫీస్ వద్ద సత్తాచాటుతుందో చూడాలి.
దొరసాని
టాలీవుడ్ యువ హీరో విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ, సీనియర్ హీరో రాజశేఖర్ కుమార్తె శివాత్మిక హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం 'దొరసాని'. కేవీఆర్ మహేంద్ర దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. సురేష్ ప్రొడక్షన్స్ సమర్పణలో మధుర ఎంటర్టైన్మెంట్స్, బిగ్ బెన్ సినిమాస్ పతాకాలపై మధుర శ్రీధర్ రెడ్డి, యష్ రంగినేని నిర్మించారు.
ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలకు మంచి స్పందన లభించింది. తెలంగాణలో దొరల కాలంలో జరిగిన ఒక నిజజీవిత ప్రేమకథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించామని చిత్రబృందం చెబుతోంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
రాజ్‌దూత్
టాలీవుడ్ విలక్షణ నటుడు శ్రీహరి పెద్ద కొడుదు మేఘాంశ్ శ్రీహరి హీరోగా పరిచయమవుతున్న చిత్రం 'రాజ్‌దూత్'. అర్జున్.. కార్తీక్ అనే ఇద్దరు ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. నక్షత్ర హీరోయిన్గా నటించింది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ ఆకట్టుకునేలా ఉన్నాయి.
రాజ్‌దూత్ అనే బైక్ చుట్టూ తిరిగే కథతో సినిమా తెరకెక్కించారు. కామెడీ సన్నివేశాలు ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటాయని... మంచి కథతో సినిమాను రూపొందించామని చెబుతోంది చిత్రబృందం. సినిమా అన్ని వర్గాల వారికి తప్పకుండా నచ్చుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు నిర్మాతలు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
నిను వీడని నీడను నేనే
సందీప్ కిషన్, అన్య సింగ్ హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన ‘ చిత్రం 'నిను వీడని నీడను నేనే'. కార్తీక్ రాజు దర్శకత్వం వహించాడు.
వెంకటాద్రి టాకీస్ వి స్టూడియోస్, విస్తా డ్రీమ్ మర్చంట్స్ పతాకాలపై దయా పన్నెం, సందీప్ కిషన్, వీజీ సుబ్రమణ్యన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కొంతకాలంగా వరుస ప్లాఫ్స్తో ఇబ్బందిపడుతోన్న సందీప్ కిషన్ కెరీర్‌కు ఈ చిత్రం విజయవంతమవడం ఎంతో అవసరం. మరి ఈ సినిమాతోనైనా ఈ యువ నటుడు విజయం సాధిస్తాడేమో చూడాలి.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇవీ చూడండి.. 'చిరంజీవితో సినిమా చేయడం ఖాయం'