ETV Bharat / sitara

హీరో విజయ్​ను​ కలిసిన యువ క్రికెటర్​ - cricketer meets tamil actor vijay

కోల్​కతా నైట్​రైడర్స్​ బౌలర్​ వరుణ్​ చక్రవర్తి.. కోలివుడ్​ స్టార్​ హీరో విజయ్​ను కలిశాడు. తన అభిమాన నటుడిని కలుసుకోవడం ఆనందంగా ఉందంటూ.. విజయ్​తో కలిసి దిగిన ఫొటోను ట్విట్టర్​లో పోస్ట్​ చేశాడు. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట్లో వైరల్​గా మారింది.

Thalapathy Vijay
విజయ్
author img

By

Published : Nov 17, 2020, 9:19 PM IST

​కోల్‌కతా నైట్‌రైడర్స్‌ యువ స్పిన్నర్‌ వరుణ్‌ చక్రవర్తి తన చిరకాల కలను సాకారం చేసుకున్నాడు. తన అభిమాన తమిళ నటుడు విజయ్​ను.. ఆయన కార్యాలయంలో మంగళవారం కలిశాడు. ఇళయదళపతిని కలుసుకోవడంపై హర్షం వ్యక్తం చేస్తూ.. తనతో కలిసి దిగిన ఫొటోను ట్విట్టర్​లో పోస్ట్​ చేశాడు. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట్లో వైరల్​ అయింది. తాను స్టార్​ హీరో విజయ్​కు వీరాభిమానినని పలు సార్లు ఇంటర్వ్యూల్లో తెలిపాడు వరుణ్​. ఆయనను కలవడం తన చిరకాల స్వప్నం అని చెప్పేవాడు.

ఈ ఐపీఎల్​లో వరుణ్​.. హ్యాట్రిక్​ తీసి అందరి దృష్టినీ ఆకర్షించాడు. తన ప్రదర్శనకు ఆస్ట్రేలియాతో జరగబోయే సిరీస్​ కోసం టీమ్ఇండియాలో చోటు కూడా దక్కింది. కానీ తనకు లీగ్​లో ఆడేటప్పుడు గాయం అవ్వడం వల్ల ఈ సిరీస్​కు దూరమయ్యాడు. మరోవైపు విజయ్​.. 'మాస్టర్'​ సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. దీపావళి కానుకగా విడుదలైన చిత్రానికి సంబంధించిన ట్రైలర్​ సినీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. 24 గంటలు పూర్తి కాకముందే 15 మిలియన్ వ్యూస్​ను కొల్లగొట్టింది. 1.7 మిలియన్ లైక్స్​ను ఖాతాలో వేసుకుంది. దక్షిణాదిలో తక్కువ వ్యవధిలోనే అత్యధిక వీక్షణలు సంపాదించిన టీజర్​గా సరికొత్త రికార్డు నెలకొల్పింది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి :

రికార్డులతో అదరగొడుతోన్న విజయ్ 'మాస్టర్​'

వరుణ్​ గాయం గురించి సెలక్టర్లకు తెలియదా?

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.