బ్రిటీష్ టెలివిజన్ షో 'ది నైట్ మేనేజర్' సిరీస్ హిందీ రీమేక్‌లో హృతిక్ నటించబోతున్నట్లు కొద్ది కాలంగా జోరుగా ప్రచారం సాగుతోంది. అయితే ప్రస్తుతం ఈ సిరీస్ నుంచి అతడు తప్పుకున్నట్లు తెలిపింది ఓ వెబ్లాయిడ్. సుదీర్ఘ షెడ్యూల్, డేట్స్ సర్దుబాటుకాకపోవడం వల్ల హృతిక్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఫలితంగా అతడి ఓటీటీ ఎంట్రీకి బ్రేక్ పడినట్లైంది.
సాధారణంగా ఈ ఏడాది ఏప్రిల్‌లో ఈ సిరీస్ చిత్రీకరణ మొదలుపెట్టాలని భావించారు. కానీ హృతిక్ తీసుకున్న అకస్మాత్తు నిర్ణయం వల్ల ఈ సిరీస్ నిర్మాతలు మరో నటుడి కోసం వెతుకులాటలో పడ్డారు.
స్పై-థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందనున్న ఈ సిరీస్‌లో హృతిక్ టామ్ హిడల్స్టన్ పాత్రలో నటించాల్సి ఉంది. ఇందుకుగానూ అతడికి రూ.75కోట్లు చెల్లించడానికి నిర్మాతలు సిద్ధమయ్యారు. ఒకవేళ ఇందులో నటించి ఉంటే అతడికి ఇదే తొలి వెబ్సరీస్ అయ్యేది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
హృతిక్ రోషన్.. ప్రస్తుతం 'ఫైటర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. యాక్షన్ అడ్వెంచర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రంలో దీపికా పదుకొణె హీరోయిన్గా ఎంపికైంది. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నాడు. మరోవైపు 'విక్రమ్ వేద' హిందీ రీమేక్‌లోనూ హృతిక్ నటిస్తున్నాడని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కాగా, బాలీవుడ్లో 3డీలో రామాయణం సినిమాను తెరెక్కించనున్నారు. ఈ సినిమాకు నితీష్ తివారీ దర్శకత్వం వహిస్తుండగా.. రావణుడిగా హృతిక్, సీత పాత్రలో దీపికా పదుకొణె నటించనున్నారని సమాచారం. రాముడి పాత్ర కోసం మహేశ్ బాబు పేరు వినిపిస్తోంది.
ఇదీ చూడండి: '3డీ'లో రామాయణం.. రావణుడిగా హృతిక్!