టాలీవుడ్‌లో వరుస హిట్లతో దూసుకెళ్తోన్న సంగీత దర్శకుడు తమన్.. కోలీవుడ్‌లోనూ అదే జోరు కొనసాగిస్తున్నాడు. ఇప్పుడు దళపతి విజయ్ నటించబోయే 'తుపాకీ 2' చిత్రానికి స్వరాలు అందించే అవకాశం దక్కించుకున్నాడు. ఈ సీక్వెల్‌కు మాతృకకు తెరకెక్కించిన మురగదాస్ దర్శకత్వం వహించనున్నారు.
సంక్రాంతికి 'అలా వైకుంఠపురములో'తో వచ్చిన తమన్.. సెన్సేషనల్ హిట్ అందుకున్నాడు. 'బుట్ట బొమ్మ', 'సామజవరగమన', 'రాములో రాములా' పాటలతో సంగీత ప్రియుల మనసుల్ని ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం 'క్రాక్', 'వకీల్ సాబ్' చిత్రాలకు స్వరాలు సమకూర్చుతున్నాడు తమన్.
మరోవైపు విజయ్.. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో 'మాస్టర్' చేస్తున్నాడు. ప్రస్తుతం లాక్డౌన్ కారణంగా షూటింగ్ నిలిచిపోయింది. ఈ ప్రాజెక్టు పూర్తయ్యాక 'తుపాకీ 2' సెట్స్‌పైకి వెళ్లనుంది.