ETV Bharat / sitara

హీరో-విలన్​ ముద్దుతో 'మాస్టర్​' చిత్రీకరణ పూర్తి - మాస్టర్​ పూర్తి

లోకేష్‌ కనకరాజ్‌ దర్శకత్వంలో విజయ్‌ నటిస్తున్న చిత్రం 'మాస్టర్‌'. విజయ్‌ సేతుపతి ప్రతినాయకుడిగా నటిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. అయితే ఇద్దరు నటుల ముద్దుతో షూటింగ్​ ముగియడం విశేషం! ఏప్రిల్​ 9న చిత్ర విడుదలపైనా అనుమానాలు నెలకొన్నాయి.

Thalapathy Vijay Kiss by Vijay Sethupathi while wrapping up Master Shooting Spot
హీరో-విలన్​ ముద్దుతో 'మాస్టర్​' చిత్రీకరణ పూర్తి
author img

By

Published : Mar 1, 2020, 7:52 AM IST

Updated : Mar 3, 2020, 12:51 AM IST

కోలీవుడ్ ప్రముఖ నటుడు విజయ్ సేతుపతిని అభిమానులు ముద్దుగా 'మక్కల్ సెల్వన్' అని పిలుస్తుంటారు. అందుకు కారణం అతడికి అభిమానులు, సహ నటులపై చాలా గౌరవం ఉండటం. ఇది చాలా సందర్భాల్లో నిరూపితం అయింది. ప్రస్తుతం ఇతడు 'మాస్టర్' సినిమాలో ప్రతినాయకుడిగా నటిస్తున్నాడు. ఈ చిత్ర షూటింగ్​ పూర్తయిన సందర్భంగా హీరో విజయ్​కు సర్​ప్రైజ్​గా బుగ్గపై ముద్దిచ్చాడు విజయ్​సేతుపతి. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట వైరల్​గా మారింది.

Master movie
హీరో విజయ్​కు ముద్దిచ్చిన విజయ్​ సేతుపతి

ఈ చిత్రానికి లోకేష్‌ కనకరాజ్‌ దర్శకుడు. మాళవిక మోహన్‌ కథానాయిక. విజయ్‌ సేతుపతి విలన్‌పాత్ర పోషిస్తున్నాడు. గతంలో రజనీకాంత్‌ నటించిన 'పేట'లో ఇతడు ప్రతినాయకుడిగా నటించాడు. హీరో విజయ్‌ కళాశాల విద్యార్థి, ఆచార్యుడిగా ద్విపాత్రాభినయం పోషిస్తున్నాడు.

Master movie
మాస్టర్​లో విజయ్​ సేతుపతి, హీరో విజయ్​

విడుదల తేదీపై సందిగ్ధం..!

ఇప్పటికే విడుదలైన పోస్టర్​లు, కుట్టీస్టోరీ పాట ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఏప్రిల్‌ 10న సినిమాను విడుదలవుతుందని గతంలో కోలీవుడ్‌లో ప్రచారం జరగింది. గుడ్‌ఫ్రైడే, ఆ తర్వాత శని, ఆదివారాలతో పాటు తమిళ సంవత్సరాది ఉండటం వల్ల సినిమా కలెక్షన్లపై ప్రభావం ఉంటుందని చిత్రబృందం ఆశించినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికీ పోస్ట్​ ప్రొడక్షన్​ పనులు ప్రారంభం కాలేదని.. వీఎఫ్​ఎక్స్​ కూడా పెండింగ్​లో ఉన్నట్లు సమాచారం. ఫలితంగా సినిమా సమ్మర్‌ స్పెషల్‌గా మే 1న విడుదల చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే నిజమైతే ఆ రోజు తలా అజయ్​ పుట్టినరోజు ఉండటం విశేషం. 'మాస్టర్​' చిత్రానికి అనిరుధ్‌ సంగీతం సమకూర్చుతున్నాడు. ఎక్స్‌బీ ఫిలిమ్‌ క్రియేషన్స్‌ బ్యానరుపై గ్జేవియర్‌ బ్రిట్టో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.

Master movie
మాస్టర్​లో విజయ్​ సేతుపతి, హీరో విజయ్​

ఇవీ చదవండి...

నెటిజన్లను ఊర్రూతలూగిస్తోన్న విజయ్-అనిరుధ్​​ పాట

Last Updated : Mar 3, 2020, 12:51 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.