ETV Bharat / sitara

ఆ సినిమా కోసం నిజమైన విమానాన్నే కూల్చేశారు! - టెనెట్ క్రిస్టోఫర్ నోలాన్

హాలీవుడ్​ భారీ చిత్రం 'టెనెట్'లోని ఓ సన్నివేశం కోసం నిజమైన విమానాన్నే కూల్చేశామని దర్శకుడు క్రిస్టోఫర్ నోలాన్ తెలిపారు. ఇటీవలే విడుదలైన ట్రైలర్​ తెగ ఆకట్టుకుంటోంది.

ఆ సినిమా కోసం నిజమైన విమానాన్నే కూల్చేశారు!
టెనెట్ సినిమాలో జాన్ డేవిడ్ వాషింగ్టన్
author img

By

Published : May 29, 2020, 6:52 AM IST

సాధారణంగా సినిమాల్లో కార్లు, విమానాలు క్రాష్ అయ్యే సన్నివేశాలుంటే వాటిని సీజీ(కంప్యూటర్‌ గ్రాఫిక్స్‌)లో సృష్టిస్తారు. లేదా అచ్చం అలాగే ఉండే వాటిని తయారు చేయిస్తారు. కానీ, హాలీవుడ్‌ దర్శకుడు క్రిస్టోఫర్‌ నోలాన్‌ మాత్రం తన కొత్త సినిమా 'టెనెట్‌' కోసం నిజమైన విమానాన్నే క్రాష్ చేశారట. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన కొత్త ట్రైలర్‌ను విడుదల చేశారు. ఇందులో చివర్లో 747 బోయింగ్ విమానం క్రాష్ అయినట్లు చూపించారు. చూసిన వారంతా అది గ్రాఫిక్స్‌లో సృష్టించడం లేదా, ప్రత్యేకంగా తయారు చేయించింది అనుకుని ఉంటారు. కానీ, కాదట. అది నిజమైన బోయింగ్‌747 విమానమని దర్శకుడు నోలాన్‌ తాజాగా చెప్పారు.

Christopher Nolan with John David Washington
నటుడు జాన్ డేవిడ్ వాషింగ్టన్​తో దర్శకుడు క్రిస్టోఫర్ నోలాన్

"మినియేచర్‌, బిల్డింగ్‌ సెట్‌ల ద్వారా ఆయా సన్నివేశాలను తీసి, మిగిలినది విజువల్‌ ఎఫెక్ట్‌ ద్వారా పూర్తి చేయాలని అనుకున్నా. లొకేషన్స్‌ కోసం వెతుకుతున్నప్పుడు కాలిఫోర్నియాలోని విక్టర్‌విల్లేలో పాత విమానాలను చూశాం. సీజీ, మినియేచర్‌లతో పోలిస్తే, నిజమైన విమానాన్ని కొనుగోలు చేసి, ఆయా సీక్వెన్స్‌ తీయడం వల్ల అద్భుతమైన అనుభూతి కలుగుతుందని భావించాం. అందుకే విమానాన్ని కొన్నాం. నిజంగా ఇదొక కొత్త అనుభవం. మా చిత్ర స్పెషల్‌ ఎఫెక్ట్స్‌ సూపర్‌ వైజర్‌ స్కాట్‌ ఫిషర్‌, ప్రొడక్షన్‌ డిజైనర్‌ నాథన్‌ క్రౌలీ సాయంతో ఆ సీన్లు బాగా వచ్చాయి" అని క్రిస్టోఫర్‌ నోలాన్‌ అన్నారు.

జాన్‌ డేవిడ్‌ వాష్టింగ్టన్‌, రాబర్ట్‌ పాటిసన్‌, ఎలిజెబెత్‌ డెబిస్కీ, డింపుల్‌ కపాడియా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా.. జులై 17, 2020న ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. కానీ కరోనా కారణంగా విడుదల వాయిదా పడింది. తప్పకుండా ఈ సినిమాను థియేటర్‌లలోనే విడుదల చేస్తామని చిత్ర బృందం తెలిపింది. టైమ్‌ ట్రావెల్‌ కథాంశంతో సాగే సినిమా అంటూ సాగిన ప్రచారానికి ఈ కొత్త ట్రైలర్‌తో తెరపడింది. మరి ఈసారి క్రిస్టోఫర్‌ నోలాన్‌ ఏ కాన్సెప్ట్‌తో సినిమాను తెరకెక్కించారో చూడాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.