ETV Bharat / sitara

'శ్రీదేవి సోడా సెంటర్' ట్రైలర్.. కీర్తి మరో​ సినిమా ఓటీటీలో! - వైష్ణవ్​తేజ్ రకుల్​ప్రీత్

సినీ అప్డేట్స్ వచ్చేశాయి. ఇందులో శ్రీదేవి సోడా సెంటర్, సానికాయిదమ్, రైటర్ పద్మభూషణ్, వైష్ణవ్​తేజ్ కొత్త చిత్రానికి సంబంధించిన సంగతులు ఉన్నాయి.

telugu movie latest updates
మూవీ అప్డేట్స్
author img

By

Published : Aug 19, 2021, 11:23 AM IST

*'శ్రీదేవి సోడా సెంటర్' ట్రైలర్​ వచ్చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో పరువు, కులం తదితర విషయాలు ఎంతలా పట్టించుకుంటారు? వాటి వల్ల ప్రేమికులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయనే కాన్సెప్ట్​తో ఈ సినిమా తీసినట్లు తెలుస్తోంది. సుధీర్​బాబు, ఆనంది హీరోహీరోయిన్లుగా నటించారు. 'పలాస' ఫేమ్ కరుణకుమార్ దర్శకత్వం వహించారు. ఆగస్టు 27న థియేటర్లలో విడుదల కానుందీ చిత్రం.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

*లాక్​డౌన్​లో కీర్తి సురేశ్​ సినిమాలన్నీ ఓటీటీలోనే రిలీజ్ అయ్యాయి. ఇప్పుడు అదే బాటలో మరో చిత్రాన్ని కూడా తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. గురువారంతో చిత్రీకరణ పూర్తి చేసుకున్న 'సానికాయిదమ్'ను త్వరలో అమెజాన్ ప్రైమ్​లో విడుదల చేయనున్నట్లు సమాచారం. ఇందులో స్టార్ డైరెక్టర్ సెల్వరాఘవన్ కీలకపాత్ర పోషించడం విశేషం.

.
.

*యువ నటుడు సుహాస్​ పుట్టినరోజు సందర్భంగా తన కొత్త సినిమా 'రైటర్ పద్మభూషణ్' కొత్త పోస్టర్​ విడుదల చేశారు. ఆశిష్ విద్యార్థి, రోహిణి.. పద్మభూషణ్​ పాత్ర తల్లిదండ్రులుగా కనిపించనున్నారు. షణ్ముఖ ప్రశాంత్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు.

.
.

*మెగాహీరో వైష్ణవ్​తేజ్, రకుల్​ ప్రీత్ జంటగా ఓ సినిమాలో నటించారు. ఈ చిత్ర టైటిల్​తోపాటు ఫస్ట్​లుక్​ను శుక్రవారం ఉదయం 10:15 గంటలకు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. క్రిష్ దర్శకత్వం వహించారు. 'కొండపొలం' నవల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కించారు. కీరవాణి సంగీతమందించారు.

.
.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.